దుమ్ముగూడెం : మండలంలోని నారాయణరావుపేట బాలుర ఆశ్రమ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న పెద్దబండిరేవు గ్రామానికి చెందిన సోయం సుకుమార్ (12) అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతి చెందాడు. ఈ నెల 13న జ్వరం రావడంతో మరుసటి రోజు తల్లి సుభద్ర విద్యార్థిని ఇంటికి తీసుకెళ్లింది. ఆయాసం వస్తుండటంతో ఈ నెల 17న దుమ్ముగూడెం ఆస్పత్రికి తీసుకెళ్లగా కామెర్లు ఉన్నట్టు గుర్తించిన వైద్యులు భద్రాచలం తీసుకెళ్లాలని సూచించారు. దీంతో ఏరియా ఆస్పత్రిలో చేర్చగా, వైద్యులు పరీక్షించి రక్తం ఒక శాతమే ఉన్నట్లు తేల్చారు. మూడు దఫాలుగా రక్తం ఎక్కించారు. అయినా విద్యార్థి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందిస్తున్నారు. పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందాడు. విద్యార్థి మృతిపై హెచ్‌ఎం కుంజా శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు.