రఘునాథపాలెం: మండలంలోని బావోజీతండాలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైన ఆయిల్‌పామ్ తోటలను నాలుగు శాఖల అధికారులు గురువారం పరిశీలించారు. విద్యుత్‌శాఖ ఎస్‌ఈ శ్రీనివాసచార్యులు, డీఈ రామారావు, ఏడీ సంఽజీవ్‌కుమార్, ఏఈ సతీష్, వ్యవసాయశాఖ ఏడీఏ కొంగర వెంకటేశ్వర్లు, ఏఓ ఉమామహేశ్వర్‌రెడ్డి, ఉద్యానవన అధికారి నగేష్, ఆర్‌ఐలు సత్యనారాయణ, ప్రవీణ్ బాధిత రైతులతో మాట్లాడారు. ఈమేరకు బానోత్ పార్వతి, ప్రమీలకు చెందిన తొమ్మిది ఎకరాల తోటకు నష్టం జరిగిందని చెప్పగా, ఆయిల్‌పామ్, శ్రీగంధం చెట్లతో పాటు డ్రిప్ ఇరిగేషన్ పైపులు కూడా కాలిపోయాయని వివరించారు. తోటలపై నుంచి వెళ్తున్న విద్యుత్ లైన్‌ను మార్చాలని కోరినా అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని రైతులు వాపోయారు. కాగా, నష్టం వివరాలతో ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని ఉద్యాన శాఖ అధికారి నగేష్ తెలిపారు.