భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం గిరిజన దర్బార్ నిర్వహిస్తున్నామని, అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని పీఓ బి.రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే గిరిజన దర్బార్‌లో ఆదివాసీలు తమ సమస్యలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందజేయాలని పేర్కొన్నారు.
కిన్నెరసానిలో
పర్యాటకుల సందడి
ఒకరోజు ఆదాయం రూ.21, 945
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కిన్నెరసానికి ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. జిల్లా నలుమూలలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీగా తరలివచ్చారు. డ్యామ్ పైనుంచి జలాశయాన్ని, డీర్‌పార్కులో దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 339 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.11,625, 250 మంది బోటు షికారు చేయడం ద్వారా టూరిజం కార్పొరేషన్‌కు రూ.10, 320 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.