మణుగూరురూరల్: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో పూరిల్లు దగ్ధమైన ఘటన శనివారం మండలంలోని పగిడేరు గ్రామంలో చోటుచేసుంది. గ్రామానికి చెందిన కుంజా కేశవరావు, కుటుంబ సభ్యులు రోజులాగానే పనులపై బయటికి వెళ్లారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగగా స్థానికులు అగ్నిమాపకశాఖకు సమాచారం అందించారు. మాజీ సర్పంచ్ తాటి సావిత్రీ – భిక్షం దంపతులు స్థానికుల సాయంతో మంటలను ఆర్పేందుకు యత్నించారు. అయినప్పటికీ పూరిల్లు మొత్తం దగ్ధమైంది. ఇంట్లోని దుస్తులు, విలువైన సామగ్రి కాలిబూడిదైంది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.


