పరిహారం సంగతి తేల్చండి | - | Sakshi
Sakshi News home page

పరిహారం సంగతి తేల్చండి

Sep 26 2026 2:02 AM | Updated on Sep 26 2026 2:02 AM

ఇన్‌చార్జి మంత్రి

గొట్టిపాటిని నిలదీసిన రైతులు

నరసరావుపేట రూరల్‌: న్యాయమైన పరిహారం చెల్లించకుండా నిర్వహిస్తున్న 167ఏ జాతీయ రహదారి భూమి పూజ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని బాధిత రైతుల ప్రకటించారు. దీంతో శుక్రవారం ఉదయం కేసానుపల్లి వద్ద నిర్వహించిన భూమిపూజను హడావుడిగా ముగించారు. ముందుగా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించాలని భావించారు. అటువంటిదేమీ లేకుండానే అరగంటలో కార్యక్రమాన్ని ముగించారు. కార్యక్రమానికి హాజరైన రైతులు మాత్రం పరిహారం సంగతి తేల్చాలని ఇన్‌చార్జ్‌ మంత్రి గొట్టిపాటి, ఎంపీ లావు, ఎమ్మెల్యేలను నిలదీశారు. భూ సేకరణ సమయంలో అధికారులు ఇచ్చిన మాట తప్పారని మండిపడ్డారు. ఎకరానికి రూ.1.60 కోట్లు ఇస్తామని చెప్పి ఇప్పుడు రూ.1.18 కోట్లు ఇవ్వడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అర్బిట్రేషన్‌కు వెళ్లాలని ప్రజాప్రతినిధులు సూచించారు. వాడరేవు– నకరికల్లు అడ్డరోడ్డు జాతీయ రహదారి విస్తరణ పనులు రెండు సంవత్సరాల్లో పూర్తవుతాయని జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు. 167ఏ జాతీయ రహదారి ఫేజ్‌–2 పనులకు కేసానుపల్లి సమీపంలో శుక్రవారం భూమి పూజ చేశారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా, జేసీ సంజనా శ్రీహర్షలు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ రోడ్డు అందుబాటులోకి వస్తే సూర్యలంక పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. నరసరావుపేటలో ట్రాఫిక్‌ సమస్య తీరడంతోపాటు ప్రమాదాలు తగ్గుతాయని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement