తాడేపల్లి రూరల్ : ప్రకాశం బ్యారేజ్ రిజర్వాయర్ వద్ద 12 అడుగుల నీటి మట్టాన్ని ఉంచుతూ దిగువ ప్రాంతానికి శుక్రవారం నీటిని విడుదల చేసినట్లు జేఈ రమేష్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఎగువ ప్రాంతం నుంచి 41,994 క్యూసెక్కుల వరదనీరు ప్రకాశం బ్యారేజ్‌కు చేరుకుందన్నారు. దిగువకు 47,125 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని చెప్పారు. సాగు, తాగు నీటి కోసం పశ్చిమ కాలువకు 2,519 క్యూసెక్కులు, తూర్పు కాలువకు 5,026, గుంటూరు చానల్‌కు 259 క్యూసెక్కులు విడుదల చేశామని తెలిపారు. రాత్రి 8 గంటల సమయంలో మరోసారి వచ్చే వరద రీడింగ్ చూసి బ్యారేజ్ వద్ద నీటి మట్టాన్ని మెయింటెన్ చేస్తూ నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు రమేష్ తెలిపారు.


