స్వాతంత్య్ర దిన వేడుకలకు సిద్ధమైన పేరేడ్ గ్రౌండ్ ట్రయల్‌రన్ నిర్వహించిన జిల్లా పోలీస్ యంత్రాంగం
బాపట్ల టౌన్: పోలీస్ పేరెడ్ గ్రౌండ్‌లో పంద్రాగష్టు వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం నిర్వహించే వేడుకలకు వేదికతోపాటు వివిధ అభివృద్ధి పథకాలకు సంబంధించిన శకటాలు ప్రదర్శించేందుకు గ్రౌండ్‌ను సిద్ధం చేశారు. గ్రౌండ్‌లో శుక్రవారం ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ అధికారులు ట్రయల్‌రన్ నిర్వహించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రికి అందించే గౌరవ వందనానికి సంబంధించి పరిశీలించారు. జిల్లా పోలీసుల కవాతుపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఓ వైపు జాతీయ జెండాలు రెపరెపలాడగా, కవాతు నిర్వహించే మైదానంలో క్రీడా జెండాలు ఆకట్టుకుంటున్నాయి. ఏఆర్ డీఎస్పీ పి. కృష్ణంరాజు పెరేడ్ కమాండర్‌గా వ్యవహరించారు. ముందుగా సిబ్బంది నుంచి జిల్లా ఎస్పీ గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. వాహనంలో పర్యటించి సాయుధ పోలీసు బలగాల పరేడ్‌ను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బంది పతకాలు ఎలా అందుకోవాలో డెమో నిర్వహించారు. ఏర్పాట్లపై ఎస్పీ సమీక్షించారు. ప్రజలకు, విద్యార్థులకు అసౌకర్యం తలెత్తకుండా భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. శాఖలన్నీ సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ ఎల్. సుధాకర్, ఏఆర్ డీఎస్పీ పి. కృష్ణంరాజు, ఎస్‌బీ సీఐ జి. నారాయణ, ఆర్‌ఐలు షేక్ మౌలుద్దీన్, ప్రదీప్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


