జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్
బాపట్ల: స్వాతంత్య్ర దిన వేడుకలు జరగనున్న పోలీస్ కవాతు మైదానాన్ని సుందరంగా ముస్తాబు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. ప్రాంగణాన్ని త్రివర్ణ పతాకాలతో నింపాలని చెప్పారు. వేదిక, కవాతు నిర్వహించే ప్రాంతం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే ప్రాంగణం, అతిథులు, ప్రజలు కూర్చోవడానికి వీలుగా సీట్లు ఏర్పాటు చేయాలన్నారు. వేడుకలు సమయపాలనతో నిర్వహించాలని ఆదేశించారు. స్టాల్స్ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఆర్‌వో లవన్న, బాపట్ల ఆర్డీవో హరికుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


