బాపట్ల: సహకార సంఘాల ప్రగతి జిల్లా అభివృద్ధికి దోహదపడే విధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్‌కుమార్ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వీక్షణ సమావేశ మందిరంలో జిల్లా సహకార సంఘాల అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశం ఆయన అధ్యక్షతన నిర్వహించారు. పీఏసీఎస్‌లపై సభ్యులతో జిల్లా కలెక్టర్ సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాకు 45 ఎంపీఎఫ్‌సీ గోడౌన్లు మంజూరు కాగా, అందులో 10 గోడౌన్లను స్థానిక సమస్యల కారణంగా రద్దు చేసినట్లు, 30 గోడౌన్ల నిర్మాణం పూర్తయినట్లు, మిగిలిన 5 గోడౌన్లు నిర్మాణ దశలో ఉన్నట్లు జిల్లా సహకార సంఘాల అధికారి కలెక్టర్‌కు వివరించారు. జిల్లాకు మంజూరైన 5 జనరిక్ మందుల దుకాణాల్లో 3 దుకాణాలు నిర్వహణలో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఎంపీఎఫ్‌సీ గోడౌన్ల వివరాలను గూగుల్ షీట్ ద్వారా తయారు చేసి ఇవ్వాలని మార్కెటింగ్ శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ఆయా శాఖల లక్ష్యాలను గణాంకాల రూపంలో ఎలాంటి తేడా లేకుండా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పురుగుమందులు, పెట్రోల్ బంకులు, కామన్ సర్వీస్ సెంటర్లు, పీఏసీఎస్‌లకు సంబంధించి షాపుల వారీగా నివేదికలను తయారు చేసి అందజేయాలని ఆదేశించారు. జిల్లా సహకార సంఘాల అధికారి కే యలమందరావు, వ్యవసాయ శాఖ జేడీ శ్రీలక్ష్మి, మత్స్య శాఖ జేడీ శ్రీనివాస్ నాయక్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వేణుగోపాల్, మార్కెటింగ్ ఏడీ రమేష్‌బాబు, మార్క్‌ఫెడ్ డీఎం కరుణశ్రీ, నాబార్డ్ జిల్లా అభివృద్ధి మేనేజర్ రవికుమార్, డీసీసీబీ బ్యాంక్ మేనేజర్లు పాల్గొన్నారు.
పకడ్బందీగా భూముల రీ సర్వే
రీ సర్వే నిర్వహించిన భూములలో ఇతరులు అనే పదం ఉండటానికి వీలులేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ రెవెన్యూ అధికారులకు సూచించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీక్షణ సమావేశ మందిరంలో 22 ఏ, రీ సర్వే, ల్యాండ్ ఎలిమినేషన్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 22ఏ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే పరిష్కరించాలన్నారు. చుక్కల భూముల సమస్యల పరిష్కారం కోసం వాటిని జిల్లా స్థాయి కమిటీ సమీక్ష సమావేశంలో ఉంచాలన్నారు. వేటపాలెం మండలం పుల్లూరి పాలెంలో జాయింట్ ఎల్పీఎంలు ఎక్కువగా ఉన్నందున పరిశీలించి పరిష్కరించాల్సిన అవసరం ఉందని అధికారులు చెప్పారు. వేటపాలెం గ్రామంలో డ్రాఫ్ట్ ఈ కేవైసీ పెండింగ్ ఉందన్నారు. పర్చూరు, చీరాల మండలాల్లో రైతుబజార్‌ల ఏర్పాటుకు భూమిని గుర్తించాలని అధికారులకు సూచించారు. జేసీ భావన వశిష్ట, ఇన్‌చార్జి డీఆర్‌వో లవన్న, ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శేషగిరిరావు, వీక్షణ సమావేశం ద్వారా ఆర్డీవోలు, తహసీల్దార్లు, వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్‌కుమార్


