పాముకాటుతో రైతు మృతి | - | Sakshi
Sakshi News home page

పాముకాటుతో రైతు మృతి

Aug 12 2026 1:28 AM | Updated on Aug 12 2026 1:28 AM

వెంగళరావునగర్‌ గరల్స్‌ స్కూల్లో ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ ఉపాధ్యాయుడికి షోకాజ్‌ నోటీసు ఇచ్చిన డీఈవో

కర్లపాలెం: పాముకాటుకు గురై ఓ రైతు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని యాజలి గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. యాజలి గ్రామానికి చెందిన కాసాని శ్రీనివాసరావు సోమవారం కాలువ గట్లను సరి చేస్తుండగా పాము కాటు వేసింది. బాధితుడిని బాపట్ల ఏరియా వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మృతుని భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రవీంద్ర తెలిపారు.

నేడు ఏఎన్‌యూలో ప్రముఖులకు సత్కారం

ఏఎన్‌యూ(పెదకాకాని): ఏఎన్‌యూ స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని విశ్వవిద్యాలయ అభివృద్ధికి విశేషంగా సేవలందించిన దాతలు, ప్రముఖు లు, విద్యావేత్తలను ఘనంగా సత్కరించనున్నట్లు విశ్వ విద్యాలయ ఉన్నతాధికారులు రెక్టార్‌ ఆచార్య రామి నేని శివరాం ప్రసాద్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య జి.సింహాచలం తెలిపారు. స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం డాక్టర్‌ డైక్‌మన్‌ ఆడిటోరియంలో నిర్వ హించనున్న దాతల సత్కార కార్యక్రమం వివరాల ను వెల్లడించారు. 1976లో స్థాపించబడిన విశ్వవిద్యాలయం 2026లో 50వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఏడాది పొడవునా స్వర్ణోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.

విశిష్ట దాతలకు సత్కారం..

విశ్వవిద్యాలయానికి వివిధ రూపాల్లో సేవలందించిన దాతల సత్కార కార్యక్రమానికి వర్సిటీ ఉపకులపతి ఆచార్య కే గంగాధర్‌రావు అధ్యక్షత వహించనున్నట్లు చెప్పారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర శాసనసభ డెప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణంరాజు, అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్‌, ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అరుణ్‌ కుమార్‌ మొహంతి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆచార్య కె.మధుమూర్తి హాజరు కానున్నారు. అలానే డాక్టర్‌ బయ్యపు శ్రీకృష్ణమూర్తి, జాగర్లమూడి మురళీమోహన్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులు ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, డాక్టర్‌ అయ్యంగార్‌, దాతలు తులసి రామచంద్రప్రభు, ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, పాలడుగు లక్ష్మణరావు, డాక్టర్‌ రాయపాటి శ్రీనివాస్‌, ముద్దులేని శ్రీనివాస్‌, డాక్టర్‌ వైవీ ఆంజనేయులు, శివరామకృష్ణ ప్రసాద్‌, ఎం.కమలాకర్‌ బాబు, కర్రి గోపాలకృష్ణ, హేమంత్‌రెడ్డి, ఎన్‌.భారతి, షేక్‌ షమీమ్‌ భాను, రెవరెండ్‌ డాక్టర్‌ కేఎఫ్‌ పరదేషి బాబు తదితర ప్రముఖులను కూడా సత్కరించనున్నారు.

విద్యార్థినిని వాతలు తేలేలా కొట్టిన టీచర్‌

గుంటూరు ఎడ్యుకేషన్‌ అల్లరి చేస్తోందనే కారణంతో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థినిని ఉపాధ్యాయుడు వాతలు తేలేలా కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గుంటూరు వెంగళరావునగర్‌లోని నగరపాలక సంస్థ బాలికోన్నత పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని పెండం చైత్రను సదరు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు రమేష్‌ బెత్తంతో ఎడమ చేతిపై వాతలు తేలేలా కొట్టారు. ఈనెల 7వ తేదీన సంఘటన జరగ్గా, వరుసగా సెలవులు రావడంతో ఈ విషయం వెలుగులోకి రాలేదు. విద్యార్థినిని దండించిన ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో జిల్లా విద్యాశాఖాధికారి షేక్‌ సలీం బాషా సదరు పాఠశాల హెచ్‌ఎం, బాధ్యుడైన ఉపాధ్యాయుడితో పాటు తల్లిదండ్రులను మంగళవారం డీఈవో కార్యాలయానికి పిలిపించారు. సంఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్న డీఈవో విద్యార్థిని పరిస్థితిపై ఆరా తీశారు. ఉపాధ్యాయుడు కొట్టిన దెబ్బలు తీవ్రంగా తగిలి ఉంటే పెను ప్రమాదమే జరిగి ఉండేదని తల్లిదండ్రులు చెప్పారు. సంఘటనను తీవ్రంగా పరిగణించిన డీఈవో సలీం బాషా సదరు ఉపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను దండించరాదని తెలిసినా, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై మండిపడ్డారు. అనంతరం సదరు ఉపాధ్యాయుడికి షోకాజ్‌ నోటీసు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement