కొల్లూరు: చుక్క నీటి కోసం అర్రులు చాస్తున్న పంటలకు వర్షం జీవం పోసింది. గురువారం రాత్రి మండలంలో భారీగా కురిసిన వర్షానికి వాణిజ్య పంటలు, ఖరీఫ్‌లో సాగు చేసిన వరి పంటకు మేలు చేకూరింది. కూటమి ప్రభుత్వం కాలువలకు సాగు నీరు విడుదల చేయడంలో వైఫల్యంతో రైతులు పంటలకు నీరందించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. సాగు నీటి కొరతకుతోడు ఎల్‌నినో ప్రభావంతో విపరీతంగా ఎండలు కాస్తున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు మాడిపోయి ఎదుగుదలపై ప్రభావం పడుతోంది. ఈ తరుణంలో వరుణుడు కరుణించడంతో పంటలు జీవకళను సంతరించుకున్నాయి. తీవ్ర నీటి ఎద్దడి కారణంగా బోర్ల కింద పంటలకు నీరందించినా ప్రయోజనం లేక విలవిలాడుతున్న రైతుల మోములు వర్షంతో కాస్త కళకళలాడుతున్నాయి.


