మార్టూరులో భూచోళ్లు | - | Sakshi
Sakshi News home page

మార్టూరులో భూచోళ్లు

Jul 17 2026 3:10 AM | Updated on Jul 17 2026 3:10 AM

న్యూస్‌రీల్‌

రూ.కోట్ల విలువైన భూములు ఎలా కట్టబెడతారు?

చెరుకుపల్లిలో భారీ వర్షం

బాపట్ల
శుక్రవారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2026

యథేచ్ఛగా ప్రభుత్వ భూముల పందేరం

టీడీపీ నేతలకు అధికారుల

అండదండలు

ఫిర్యాదు చేసినవారిపైనే

అధికారుల చిందులు

మార్టూరు: మండల కేంద్రం మార్టూరులో ప్రభుత్వ భూములను అధికార పార్టీ నాయకులకు రెవెన్యూ అధికారులే యథేచ్ఛగా కట్టబెడుతున్నారనే ఆరోపణు ఉన్నాయి. రూ.కోట్లు విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కావడంతో ప్రజా సంఘాల నాయకులు కొందరు తరచూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్నా ఎవరూ ఖాతరు చేయడంలేదు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా రాజుగారి పాలెం వెళ్లే రోడ్డులో గల రెండు ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని ఇటీవల స్థానిక టీడీపీ నాయకుడి పేరుతో తహసీల్దార్‌ ఆన్‌లైన్‌ చేశారు. బహిరంగ మార్కెట్లో సుమారు రూ.6కోట్ల విలువైన ఆ భూమిలో ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయబోతున్నారంటూ మార్టూరుకు చెందిన దళిత నాయకుడు రామకూరి విజయ్‌ కుమార్‌ అనే వ్యక్తి గత సోమవారం గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తహసీల్దార్‌ ప్రశాంతి అర్జీ ఇచ్చిన విజయ్‌ కుమార్‌ను మంగళవారం తన కార్యాలయానికి పిలిపించుకుని తిట్ల దండకం అందుకున్నట్లు బాధితుడు విలేకరులకు తెలిపాడు.

ఈక్రమంలో విజయకుమార్‌ తహసీల్దార్‌తో ‘భూమిలేని నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వ్యక్తులకు సెంటు భూమి ఇవ్వడం కోసం అనేక షరతులు పెట్టే అధికారులు.. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా ఉన్నవారికి రూ.కోట్ల ప్రభుత్వ భూములు ఎలా కట్టబెడతారు? త్వరలో ప్రజాసంఘాలతో మీ కార్యాలయం ముందు ధర్నా చేస్తాం’ అని హెచ్చరించినట్లు తెలిపారు. అంతేకాక స్థానిక పోలీస్‌ స్టేషన్‌ పక్కన గల రూ.30 కోట్ల విలువైన మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని అగ్రవర్ణానికి చెందిన ఓ టీడీపీ నాయకుడికి ఎలా కట్టబెడుతున్నారని.. దీనిపై కూడా పోరాడతాం అని అన్నట్లు విలేకరులకు చెప్పారు. వాస్తవానికి పోలీస్‌ స్టేషన్‌ పక్కన గల మూడు ఎకరాల భూమి అన్యాక్రాంతానికి ప్రయత్నం జరుగుతున్న విషయంపై గత నెలలో రాజశేఖర్‌ అనే వ్యక్తి నేరుగా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌కు అర్జీ ఇచ్చారు. ఆ విషయమై ఎలాంటి చర్యలు తీసుకున్న విషయం తెలియదు కానీ సదరు నాయకుడు మాత్రం ఆ భూమిలో పంట వేయడం కోసం ఇటీవల దున్నిన విషయం ప్రస్తుతం మార్టూరులో చర్చనీయాంశంగా మారింది. త్వరలో తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నాకు సిద్ధం కాబోతున్నట్లు విజయ్‌ కుమార్‌ మీడియాకు తెలిపారు.

చెరుకుపల్లి: చెరుకుపల్లిలో గురువారం సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘా వృతమై చల్లని గాలి వీస్తూ భారీ వర్షం కురిసింది. దీంతో వాతావరణం చల్లబడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement