సినీ రచయిత కోన వెంకట్‌కు మాతృ వియోగం | - | Sakshi
Sakshi News home page

సినీ రచయిత కోన వెంకట్‌కు మాతృ వియోగం

Jul 17 2026 3:10 AM | Updated on Jul 17 2026 3:10 AM

అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు నాదెండ్ల: అతివేగంగా వెళ్తున్న కారు ముందున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపుతప్పి మూడు పల్టీలు కొట్టిన ఘటన గణపవరం ప్రసన్న వంశీ స్పిన్నింగ్‌ మిల్లు ఎదురుగా గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు చిలకలూరిపేటకు చెందిన ఎస్‌కే బబ్లు అనే వ్యక్తితో పాటు మరో ముగ్గురు ఉదయం 9 గంటల సమయంలో కారులో గుంటూరు వైపు బయలుదేరారు. ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపు తప్పి కారు పల్టీలు కొట్టింది. కారు నుజ్జునుజ్జు కాగా బబ్లు స్వల్ప గాయాలపాలయ్యాడు. మిగిలిన ముగ్గురికి ఎలాంటి గాయాలు కాలేదు. కారు నడుపుతున్న యువకుడికి డ్రైవింగ్‌ లైసెన్సు లేకపోవటం, కారుకు బీమా లేనట్లు పోలీసులు గుర్తించారు.

బాపట్ల: సినీ రచయిత నిర్మాత కోన వెంకట్‌కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి కోన ధర్మావతి (82) బుధవారం రాత్రి వైజాగ్‌లో కన్నుమూశారు. ఆమె మాజీ డెప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతికి వదిన. ధర్మావతి మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

వైఎస్సార్‌ సీపీ లీగల్‌సెల్‌ రాష్ట్ర కార్యదర్శిగా మణిబాబు

నరసరావుపేట: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు సత్తెనపల్లికి చెందిన చిన్నం మణిబాబును లీగల్‌సెల్‌ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మాచర్లకు చెందిన మేరాజ్యోత్‌ హనుమానాయక్‌ను పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమించారు.

గుర్తు తెలియని వ్యక్తి మృతి

మాచర్ల: పట్టణంలోని గుర్తు తెలియని వ్యక్తి గురువారం తెల్లవారు జామున బస్టాండ్‌ ఎదురు వెంగమాంబ కాంప్లెక్స్‌ వద్ద మృతి చెందాడు. సుమారు 42 సంవత్సరాలు కలిగిన వ్యక్తి అపస్మారక స్థితిలో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పట్టణ పోలీసులు స్వామి వివేకానంద చారిటబుల్‌ ట్రస్టు వారికి తెలుపగా పోలీసుల సహకారంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎవరైనా స్నేహితులు, బంధువులు సంబంధిత వ్యక్తిని గుర్తుపడితే మాచర్ల పట్టణ పోలీసు స్టేషన్‌ను సంప్రదించాలన్నారు. స్వామి వివేకానంద చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ మెట్టు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రి మార్చురీకి చేర్చారు.

ద్విచక్ర వాహనాల

దొంగలు అరెస్టు

నూజండ్ల: ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఇరువురు దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు ఐనవోలు ఎస్సై బి.వి.కృష్ణారావు గురువారం తెలిపారు. పల్నాడు జిల్లా పరిధిలో ఇటీవల ద్విచక్రాల చోరీ అధికమవుతున్నట్లు పలు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడమైందని అన్నారు. సీఐ బి.బ్రహ్మయ్య ఆదేశాలతో సిబ్బందితో కలిసి ముప్పరాజువారిపాలెం గ్రామంలో అనుమానాస్పదంగా ఉన్న ఇరువురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించమాన్నారు. గ్రామానికి చెందిన దుర్గంపూడి సుబ్బారావు, నందిగం వెంకటశివయ్యలుగా గుర్తించామన్నారు. వివిధ సంఘటనల్లో ఆరు ద్విచక్ర వాహనాలు దొంగిలించినట్లు వారు అంగీకరించటంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

కారెంపూడిలో ఐపీ దాఖలు చేసిన వ్యాపారి

కారెంపూడి: ఒక వ్యాపారి రూ. కోటిన్నరకు పైగా ఇన్‌సాల్వెన్సీ పిటిషన్‌ (ఐపీ) దాఖలు చేశారని సమాచారం గురువారం రాత్రి సంచలనం రేపింది. సదరు వ్యాపారి 22 మంది వద్ద మొత్తం రూ. 1,52,50,000లు అప్పుగా తీసుకుని వారందరికి ప్రాంసరీ నోట్లు రాసిచ్చారు. వారందరికి కూడా ఐపీ నోటీసులు సిద్ధం చేసినట్లు సమాచారం. అప్పు చెల్లించాలని అడుగుతున్నవారికి అప్పు చెల్లిస్తానని చెబుతూ వచ్చి తీరా ఐపీ దాఖలు చేయడంతో అప్పులిచ్చినవారంతా ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడి, పొదుపు పథకాలు నడుపుతున్నాడనే నమ్మకంతో వ్యాపారులు అతనికి కూడా లక్షల్లో అప్పులిచ్చారని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement