తెనాలిటౌన్: తెనాలి మార్కెట్ యార్డులో గణనీయంగా నిమ్మకాయల వ్యాపారం జరుగుతుందని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ గుంటూరు డైరెక్టర్ పి.రవి సుభాష్ పేర్కొన్నారు. రైతు శ్రేయస్సే ధ్యేయంగా యార్డును మరింత అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. మార్కెట్‌యార్డుకు చెందిన అన్ని తనిఖీ కేంద్రాల్లో ఈ–పర్మిట్ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలుచేయాలని వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ, గుంటూరు డైరెక్టర్ పట్టన్‌శెట్టి రవిసుభాష్ స్పష్టంచేశారు. స్థానిక సుల్తానాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్‌యార్డును మార్కెటింగ్‌శాఖ, గుంటూరు డైరెక్టర్ పట్టన్‌శెట్టి రవిసుభాష్ గురువారం సందర్శించారు. అక్కడి నిమ్మకాయల వ్యాపార కేంద్రానికి వెళ్లి వ్యాపారులతో మాట్లాడి నిమ్మకాయల ఎగుమతి, ధరల వివరాలను తెలుసుకున్నారు. మార్కెట్‌యార్డు చైర్మన్ తోట దుర్గాప్రసాద్ అభివృద్ధి పనులపై డైరెక్టర్‌తో చర్చించారు. ప్రాంతీయ సంయుక్త మార్కెటింగ్ సంచాలకులు ఎం.దివాకర్, విజయవాడ, సహాయ మార్కెటింగ్ సంచాలకులు, గుంటూరు పి.సత్యనారాయణచౌదరి, కార్యనిర్వాహక ఇంజినీరు కె.శేషగిరిరావు, ఉపకార్యనిర్వాహక ఇంజినీరు డి.కోటయ్య, మార్కెట్‌యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి డీసీహెచ్ సుబ్బారావు పాల్గొన్నారు.


