గ్రామ కమిటీల్లో వేమూరు ఆదర్శం
వైఎస్సార్ సీసీ ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల జోన్–3 ఇన్‌చార్జి రవీంద్రరెడ్డి
వేమూరు: గ్రామ కమిటీల నిర్మాణంలో వేమూరు నియోజకవర్గం ఆదర్శంగా నిలిచిందని వైఎస్సార్ సీసీ ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల జోన్–3 ఇన్‌చార్జి రవీంద్రరెడ్డి తెలిపారు. చెరుకపల్లి గ్రామంలోని వేమూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో మంగళవారం నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రవీంద్రరెడ్డి మాట్లాడుతూ పార్టీ గ్రామ, మండల, నియోజక వర్గ కమిటీలు, వాటి అనుబంధ కమిటీల నిర్మాణం గురించి నియోజక వర్గంలోని నాయకులను అడిగి తెలుసుకున్నారు. పార్టీ నియోజక వర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో 5500 కమిటీ ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలో తమ నియోజకవర్గం రెండోస్థానంలో నిలిచిందని చెప్పారు. గత ఏడాది నవంబరు 27వ తేదీన భట్టిప్రోలు మండలం పల్లెకోన గ్రామం నుంచి కమిటీల ఏర్పాటు ప్రారంభించామన్నారు. పార్టీ గ్రామ కమిటీలు, అనుబంధ కమిటీలు, కోటి సంతకాలు కార్యక్రమం అందరికి కన్నా ముందు పూర్తి చేయడం జరిగిందని పరిశీలకుల దృష్టికి తెచ్చారు. పార్టీ జోన్–1 పరిశీలకులు హర్షవర్థన్ మాట్లాడుతూ పదవులు పొందిన పార్టీ నాయకులకు గుర్తింపు కార్డులు అందజేస్తామన్నారు. గుర్తింపు కార్డు వల్ల అనేక ప్రయోజనలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో జోన్–4 పరిశీలకు శివశంకర్, బూత్ కమిటీ రాష్ట్ర ఇన్‌చార్జి సుధాకర్ రెడ్డి, ఎంపీపీ లలిత కుమారి, పార్టీ మండల అధ్యక్షులు దాది సుబ్బారావు, సుగ్గల నాగమల్లేశ్వరరావు, పడమటి శ్రీనివాసరావు, హిమ చంద్ర శ్రీనివాసరావు, అన్నపురెడ్డి రాఘురామి రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కోగంటి లవకుమార్, మండల పరిశీలకులు చిలుమూరు రామోహనరావు, పెరికల పద్మారావు, ఎస్సీ సెల్ నియోజక వర్గ అధ్యక్షుడు పొతర్లంక సురేష్, జంపని పురుషోత్తం, జంగం వాసు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


