విద్యాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ
జిల్లా ఇన్‌చార్జి మంత్రి పార్థసారథి
బాపట్ల: రాష్ట్రంలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. మంగళవారం బాపట్ల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ హైస్కూలు మరమ్మతులు చేపట్టిన భవన ప్రారంభ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. విద్యాభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలపై మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్, స్థానిక ఎమ్మెల్యే నరేంద్రవర్మ, ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, శివనారాయణ, ఆర్డీఓ పి.గ్లోరియా, డి ఈఓ.డి.శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రఘునాధ్‌రెడ్డి, తహసీల్దార్ షేక్ సలీమా, పాఠశాల టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.


