రఘురామ కృష్ణమరాజును పదవి నుంచి తొలగించాలి
● బ్యాంకులను ముంచినందుకు
తక్షణమే అరెస్టు చేయాలి
● మాలజాతిపై ద్వేషంతోనే ఐపీఎస్
అధికారి సంజయ్ అరెస్టు
● సునీల్‌కుమార్‌ను సస్పెండ్ చేసిన
చంద్రబాబు ప్రభుత్వం
● మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మాచవరపు జూలియన్ డిమాండ్
చీరాలరూరల్: బ్యాంకుల వద్ద కోట్లాది రూపాయ ల రుణాలు పొంది వాటిని ఎగ్గొట్టి బ్యాంకులను నిండా ముంచిన రఘురామకృష్ణమరాజును అరెస్ట్ చేయాలని మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షు డు మాచవరపు జూలియన్ డిమాండ్ చేశారు. మంగళవారం చీరాల్లోని దళిత మహాసభ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం ఆయన్ను వెనుకేసుకురావడం దురదృష్టకరమని, తక్షణమే ఆయనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలన్నా రు. ఇటీవల రఘురామకృష్ణంరాజుపై సీబీఐ అధికారులు చీటింగ్ కేసు నమోదు చేయడాన్ని ఐపీఎస్ అధికారి పీవీ సునీల్‌కుమార్ సమర్థించడం మంచిదేనన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉందన్నారు. సునీల్‌కుమార్ మాటలను తప్పుబట్టే అధికారం ఎవరికీ లేదన్నారు. ఐపీఎస్ అధికారుల సర్వీస్ రూల్స్ గురించి సునీల్‌కుమార్‌కు బాగా తెలుసునన్నారు. తమ ఆత్మగౌరవం కోసం సునీల్‌కుమార్ డీజీపీ హోదా, ఉద్యోగం వదులు కోవడానికి సిద్ధపడ్డారని అభిప్రాయపడ్డారు.
చంద్రబాబు మాల ద్వేషి...
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో మాలజాతిపై, మాల ఉద్యోగులపై వేధింపులకు పాల్పడుతోందని మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మాచవరపు జూలియన్ విమర్శించారు. అందులో భాగంగానే ఐపీఎస్ అధికారులు సంజయ్‌ను అరెస్టు చేసి పీవీ సునీల్‌కుమార్‌ను సస్పెండ్ చేసిందని పేర్కొన్నారు. చంద్రబాబు మాల ద్వేషని అందుకే మాలజాతిని అణచివేసేందుకు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ప్రభుత్వం తన బాధ్యతను నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఎస్సీ వర్గీకరణ చేశామని, మాదిగలకు మేలు జరిగిందని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు రాష్ట్రంలోని బ్యాక్‌లాగ్ పోస్టులను ఎందుకు భర్తీ చేయడంలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసం మాలజాతికి చెందిన అధికారులను, ఉద్యోగులను వేధిస్తున్నారని, తప్పుడు కేసులుపెట్టి అరెస్టులు, సస్పెండ్ చేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబుకు మాలలపై ద్వేషం లేకుంటే ఐపీఎస్ అధికారులు సంజయ్, సునీల్‌కుమార్‌లకు వెంటనే పోస్టింగులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మల్లెల బుల్లిబాబు, మేరిగ రమేష్, సలగల కెనడి, ప్రియతమ్ ఉన్నారు.


