మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములుకండి | - | Sakshi
Sakshi News home page

మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములుకండి

Dec 24 2025 4:01 AM | Updated on Dec 24 2025 4:01 AM

మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములుకండి

మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములుకండి

● గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి మాట్లాడుతూ సమష్టి కృషితోనే ఈ సామాజిక శత్రువును ఓడించవచ్చన్నారు. ధృఢమైన యువశక్తి నిర్మాణమే లక్ష్యంగా అందరూ సంకల్పంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ● ఈగల్‌ ఐజీ ఆకే.రవికృష్ణ మాట్లాడుతూ నేటి యువతను పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్య మాదక ద్రవ్యాల వ్యసనమని అన్నారు. ● జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ మాట్లాడుతూ గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను అవగాహనతోనే నిర్మూలించవచ్చునని అన్నారు. ● టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ల రామయ్య, తూర్పు ఎమ్మెల్యే నసీర్‌అహ్మద్‌లు మాట్లాడారు. ● మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నినదిస్తూ గాంధీ పార్క్‌ నుంచి జిన్నాటవర్‌ కూడలి, పాతబస్టాండ్‌ కూడలి మీదుగా తూర్పు ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌, ఎన్టీఆర్‌ సర్కిల్‌ వరకు ర్యాలీ కొనసాగింది.

నగరంపాలెం(గుంటూరు వెస్ట్‌): మాదక ద్రవ్యరహి త సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ట్రతిపాఠి అన్నారు. మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు డ్రగ్స్‌ వద్దు బ్రో, సంకల్పం ర్యాలీని మంగళవారం గుంటూరులోని మహాత్మగాంధీ పార్క్‌ వద్ద ప్రారంభించారు.

కార్యక్రమంలో మేయర్‌ కొవెలమూడి రవీంద్ర, తూర్పు డీఎస్పీ అబ్దుల్‌అజీజ్‌, పోలీస్‌ అధికారు, సిబ్బంది పాల్గొన్నారు.

విస్తృత అవగాహన

నగరంపాలెం: మాదక ద్రవ్యాల నివారణ కోసం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించా లని గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ట్రతిపాఠి అన్నా రు. జిల్లా పోలీస్‌ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్లో మంగళవారం(నవంబర్‌–2025) నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఐజీ మాట్లాడుతూ ఏ ఒక్కరిపై అయిన ఒక మాదక ద్రవ్యాల కేసు నమోదైనా, అతని విధిగా సస్పెక్ట్‌ షీట్‌ నమోదు చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై జిల్లా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. సమావేశంలో జిల్లా ఏఎస్పీలు జీవీ రమణమూర్తి (పరిపాలన), హనుమంతు (ఏఆర్‌) పాల్గొన్నారు.

గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ట్ర త్రిపాఠి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement