రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు వేటపాలెం విద్యార్థినుల
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు వేటపాలెం విద్యార్థినులు వేటపాలెం: స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం దేవరకొండ సరోజని గురువారం తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయి బాల, బాలికల వాలీబాల్ సెలక్షన్స్‌లో పాఠశాలకు చెందిన కే గాయత్రి, పీ బిందు ప్రతిభ కనబరిచి బాలికల జట్టుకు ఎంపికయ్యారు. వీరు ఈనెల 18వ తేదీన విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా విద్యార్థులను వ్యాయామ ఉపాధ్యాయులు జడ దేవభిక్షం, జరుబుల శ్రావణి, ఉపాధ్యాయులు అభినందించారు.
బైకు దొంగలు అరెస్టు
నదిలో గల్లంతైన యువకుల కోసం గాలింపు తాడికొండ: కృష్ణానది వరద ఉధృతికి తుళ్ళూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామంలో బుధవారం గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరిలో ఓ యువకుడి మృతదేహం సాయంత్రానికి లభ్యమైంది. వెంకటపాలెం నేషనల్ హైవే వంతెన పరిసర ప్రాంతంలో రెస్క్యూ టీమ్ సభ్యులు ఒకరి మృతదేహాన్ని కనుకున్నారు. మృతదేహం ప్రసంగి వీర ఉపేంద్రగా గుర్తించిన పోలీసులు పోసు్‌ాట్మర్టం నిమిత్తం ఎయిమ్స్‌కు తరలించారు. ఇసుక తోడే డ్రోజర్‌ను స్థానం మార్చేందుకు నదిలోకి దిగగా వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఇద్దరు గల్లంతయ్యారు. మృతుడి స్వగ్రామం తెనాలి వద్ద పెదపాలెం కాగా ప్రస్తుతం తాడేపల్లిలోని సీతానగరంలో నివాసం ఉంటున్నారు.
రెండు స్కూటీలు, ఒక మోటార్ బైక్ స్వాధీనం
అద్దంకి రూరల్: బైకులు, స్కూటీలు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకుల ఆటను పోలీసులు కట్టించారు. గురువారం అద్దంకి సీఐ సుబ్బరాజు నిందితుల వివరాలను వెల్లడించారు. కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామానికి కుంచాల ఏసుకుమార్, పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన ఉప్పల శివయ్యలు కలసి అద్దంకిలోని రెండు స్కూటీలు, ఒక బైకును దొంగిలించారు. ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు అద్దంకి ఎస్సై పీవీ నరసింహులు, సిబ్బంది గురువారం స్థానిక శింగరకొండ రోడ్డులోని ద్వారకా నగర్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితులను పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని ఒక బైకు, రెండు స్కూటీలను స్వాధీనం చేసుకున్నారు.
1/1
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు వేటపాలెం విద్యార్థినుల