
జిల్లాలో పెరిగిన భూగర్భ జలమట్టం
జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు
నరసరావుపేట రూరల్: జిల్లాలో భూగర్భ జల నీటిమట్టం గతేడాది కన్నా 2.26 మీటర్లు పెరిగిందని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు తెలిపారు. నీటి వనరులపై సీఎం చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సాగునీటి సంఘం సభ్యులు, అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ భూగర్భ జలం 30 మీటర్లు అడుగున ఉండే బొల్లాపల్లి మండలం, వెల్దుర్తి మండలాల్లో సైతం వరుసగా ఆరు మీటర్లు, మూడు మీటర్లు పెరిగిందని తెలిపారు. జిల్లాలో పెద్దఎత్తున ఫారం పాండ్లు నిర్మాణాల వలన వచ్చే ఏడాదికి భూగర్భ జలమట్టం పెరిగే అవకాశం ఉందని వివరించారు. సమగ్ర నీటి నిర్వహణలతో సాగునీటి సంఘ సభ్యులను, రైతులను భాగస్వాములను చేస్తామని తెలిపారు. పదిహేను రోజుల్లో అన్ని ప్రాజెక్టులకు మరమ్మతులు, కాల్వలో పూడిక తీత పనులు పూర్తికావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. భూగర్భ జలమట్టం 20 మీటర్లు, 10 మీటర్లు దిగువున ప్రాంతాల్లో జలమట్టం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై శాసీ్త్రయ ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. కార్యక్రమంలో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కాంతారావు, చీఫ్ ఇంజినీర్ బి.శ్యామ్‌ప్రసాద్, ఎస్‌ఈ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.