
నిరుపేదలకు సత్వర న్యాయమే స్వాతంత్య్రం
బాపట్ల: నిరుపేదలకు సత్వరమే న్యాయం అందించటమే నిజమైన స్వాతంత్య్రం లక్ష్యం అని జిల్లా జడ్జి కే శ్యాంబాబు అన్నారు. బాపట్ల జిల్లా కోర్టు ఆవరణలో స్వాతంత్య్ర వేడుకలు సందర్భంగా ఆరవ అదనపు జిల్లా జడ్జి కే శ్యాంబాబు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి శుభాకాంక్షలు అందజేశారు. అట్టడుగు వర్గాలకు అందిస్తున్న ఉచిత న్యాయ సేవల గురించి వివరించారు. అనంతరం నాటి త్యాగమూర్తుల సేవలను స్మరించుకున్నారు. జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కే వాణి, అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎం పవన్‌కుమార్, రిటైర్డ్ జిల్లా జడ్జి ఎన్ రమేష్, ఏజీపీ శ్యామలాదేవి, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గవిని శ్రీనివాసరావు, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ కే లక్ష్మీనారాయణ, బాపట్ల జిల్లా బార్ ఆసోసియేషన్ అధ్యక్షులు కే అవినాష్, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.