జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
బాపట్ల: ఎంతోమంది మహానుభావుల పోరాటం, ప్రాణ త్యాగాలతోనే స్వాతంత్య్ర ఫలాలు అందుకున్నామని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌పై జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ ఎగురవేశారు. త్రివర్ణ పతాకానికి ఆయన సెల్యూట్ చేసి, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రసంగిస్తూ.. స్వాతంత్య్రం పొందిన తర్వాత ఆర్థికంగా ఎంతో పురోగతి సాధిస్తున్నామని తెలిపారు. సైనికపరంగా, విదేశీ విధానాల పరంగా ప్రత్యేకత చాటుతున్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమాలకు అందరం పునరంకితం అవుదామని తెలిపారు. ఇన్‌చార్జి జిల్లా సంయుక్త కలెక్టర్ జి.గంగాధర్ గౌడ్, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి మల్లికార్జున రావు, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.