
‘ఉచిత బస్సు ప్రయాణం’ ప్రారంభం
చీరాల అర్బన్: సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన సీ్త్ర శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తెచ్చినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. శుక్రవారం సాయంత్రం చీరాల ఆర్టీసీ బస్టాండ్‌లో జిల్లా వ్యాప్తంగా సీ్త్రశక్తి పథకాన్ని ప్రారంభించారు. చీరాల ఆర్డీఓ టి.చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు. బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, కలెక్టర్ జె.వెంకటమురళి, చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య హాజరయ్యారు. మహిళలతోపాటు మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్‌లు బస్సులో ప్రయాణించారు. ఆప్కో చైర్మన్ సజ్జా హేమలత, బాపట్ల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ సలగల రాజశేఖర్, ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్దన్, ఆర్టీసీ ఆర్‌ఎం సామ్రాజ్యం, డిపో మేనేజర్ జె.శ్యామల, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.
విభిన్న ప్రతిభావంతులైన 31 మందికి ఎలక్ట్రికల్ ట్రై సైకిళ్లు, 20 మందికి వినికిడి మిషన్లును మంత్రి, ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.