సగర్వం.. మురిసె త్రివర్ణం | - | Sakshi
Sakshi News home page

సగర్వం.. మురిసె త్రివర్ణం

Aug 16 2025 6:51 AM | Updated on Aug 16 2025 6:51 AM

సగర్వ

సగర్వం.. మురిసె త్రివర్ణం

శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025 ● ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం ● జిల్లా కేంద్రంలో ఉత్సవాల్లో పాల్గొన్న విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి పెద్దింటమ్మకు గాజుల అలంకారం అమ్మవారికి సారె ముగిసిన వార్షిక బ్రహ్మోత్సవాలు జిల్లా వైభవాన్ని చాటేలా గీతం

న్యూస్‌రీల్‌

బాపట్ల
శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025

7

అమరావతి: స్థానిక గ్రామ దేవత పెద్దింటమ్మ గుడిలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మ వారిని గాజులతో వైభవంగా అలంకరించారు. అనంతరం పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.

నగరంపాలెం: స్థానిక బృందావన్‌ గార్డెన్స్‌ శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో శుక్రవారం పద్మావతి అమ్మవారికి సారె సమర్పించారు.

సత్తెనపల్లి: త్రిశక్తి దుర్గాపీఠం 19వ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో ఘనంగా ముగిశాయి. మూడు రోజులపాటు జరిగిన ఈ వేడుకల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బాపట్ల: జిల్లా చరిత్ర, వైభవాన్ని తెలియజేసేలా రూపొందిన ప్రత్యేక గీతాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, జిల్లా కలెక్టర్‌ జె.వెంకట మురళిలు కలసి స్వాతంత్య్ర దిన వేడుకల్లో ఆవిష్కరించారు. జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న కలెక్టర్‌ రచయితలకు పోటీలు నిర్వహించారు. అందులో నందిరాజు విజయ్‌ కుమార్‌ రచించిన గీతాన్ని ఉత్తమ గీతంగా ఎంపిక చేశారు. జె.నాగపూర్ణ, రమాదేవి స్వరకల్పనతో సంజయ్‌ కుమార్‌, రమాదేవి, కుమారి కీర్తి, స్వాతిలు గానం చేసిన గీతాన్ని వేదికపై ప్రదర్శించారు. ఫోరం ఫర్‌ బెటర్‌ బాపట్ల, వీఆర్‌ క్రియేషన్స్‌ ఈ పాటను రూపొందించడంలో కృషి చేశారని మంత్రి దృష్టికి కలెక్టర్‌ తెచ్చారు.

బాపట్ల /బాపట్ల అర్బన్‌: స్వాతంత్య్ర దిన వేడుకలు శుక్రవారం స్థానిక బాపట్ల జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. బాపట్ల మహిళా ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకలు అంబరాన్ని అంటాయి. విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్‌ ముఖ్యఅతిథిగా జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పోలీసుల కవాతు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రాంగణంలో త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి. దేశభక్తి గీతాలతో విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు అలరించాయి. జాతీయత, సంస్కృతులను చాటుతూ తొమ్మిది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ఆలోచింప చేశాయి. జిల్లా అభివృద్ధిని వివరించేలా శకటాల ప్రదర్శన నిర్వహించారు. సమరయోధుల కుటుంబ సభ్యులైన మరుప్రోలు శ్రీనివాస్‌ రెడ్డి వెంకటేశ్వరమ్మ, యర్రం అన్నమ్మ, జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య కుటుంబ సభ్యురాలైన పింగళి రమాదేవిలను మంత్రి సత్కరించారు. అమర సైనికుల కుటుంబ సభ్యులైన షర్మిల బేగం, షేక్‌ అత్తరున్నీసా, సింగంశెట్టి నాగ సుజాత, రబియా బీబీలకు ఇంటి స్థలాల పత్రాలను మంత్రి, కలెక్టర్‌లు పంపిణీ చేశారు.

జిల్లా అభివృద్ధికి సహకరించండి

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. స్వాతంత్య్ర ఫలాలను అట్టడుగు వర్గాల వారికి అందించడం, తద్వారా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. జిల్లా అభివృద్ధిలో పయనించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పారు. నిరుపేదలను ఆదుకునేందుకు పీ4 విధానాన్ని ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తోందన్నారు. ఈ విషయంలో రాష్ట్రంలోనే బాపట్ల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాల అమలుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. చేనేత కార్మికుల అభివృద్ధికి అడుగులు వేస్తోందన్నారు. కుప్పడం పట్టు చీరలకు జాతీయ అవార్డు లభించడంతో చేనేతల కష్టాలు తీరుతాయన్నారు. సూర్యలంక బీచ్‌ను పర్యాటక రంగంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలతో ముందుకు వెళుతుందని తెలిపారు. కార్యక్రమంలో శాసనమండలి సభ్యురాలు పోతుల సునీత, బాపట్ల, చీరాల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ, ఎంఎం కొండయ్య, ఏపీ చేనేత కార్పొరేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ సజ్జల హేమలత, జిల్లా ఎస్పీ తుషార్‌ డూడీ, ఇన్‌చార్జి సంయుక్త కలెక్టర్‌ జి.గంగాధర్‌ గౌడ్‌, జిల్లా అధికారులు, ప్రముఖులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

రుణసాయం అందజేత

360 మంది స్వయం సహాయక సంఘ సభ్యులకు ఉన్నతి పథకం ద్వారా రూ.3.60 కోట్ల రుణ సహాయం అందించారు. 28 మందికి పీఎంఈజీపీ రుణం, 340 మంది ఎస్‌హెచ్‌జీ వ్యాపారులకు రుణం, డ్వాక్రా సభ్యులకు బ్యాంక్‌ లింక్‌ ద్వారా రుణం, పీఎంఎఫ్‌ఎంఈ పథకం కింద 19 మందికి నగదు, 6,570 మంది డ్వాక్రా సభ్యులకు సీ్త్రనిధి రుణం, వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా ఐదుగురికి లాప్‌టాప్‌లు, వినికిడి మిషన్లు, 8 మందికి మహిళలకు కోడిగుడ్లతో తయారు చేసే పదార్థాలు విక్రయించేందుకు బండ్లను అందజేశారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

మహిళా ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన స్వాతంత్య్ర దిన వేడుకలలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలు సాధించిన ప్రగతిని ప్రదర్శించిన శకటాలు ఆకట్టుకున్నాయి. దేశభక్తి గీతాల ఆలాపన, నృత్యాలు, ప్రదర్శనలతో విద్యార్థులు అలరించారు. చీరాలకు చెందిన మహిత తన మైక్రో ఆర్ట్‌ ప్రతిభతో 65 పెన్సిళ్లపై డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌, 86 పెన్సిళ్లపై నెల్సన్‌ మండేలా, 73 పెన్సిళ్లపై గాంధీ, 25 పెన్సిళ్లపై డొక్కా సీతమ్మ జీవిత చరిత్రలను, 800 పెన్సిళ్లపై భగవద్గీతలోని 700 శ్లోకాలను లిఖించి ఆకట్టుకున్నారు.

సగర్వం.. మురిసె త్రివర్ణం 1
1/8

సగర్వం.. మురిసె త్రివర్ణం

సగర్వం.. మురిసె త్రివర్ణం 2
2/8

సగర్వం.. మురిసె త్రివర్ణం

సగర్వం.. మురిసె త్రివర్ణం 3
3/8

సగర్వం.. మురిసె త్రివర్ణం

సగర్వం.. మురిసె త్రివర్ణం 4
4/8

సగర్వం.. మురిసె త్రివర్ణం

సగర్వం.. మురిసె త్రివర్ణం 5
5/8

సగర్వం.. మురిసె త్రివర్ణం

సగర్వం.. మురిసె త్రివర్ణం 6
6/8

సగర్వం.. మురిసె త్రివర్ణం

సగర్వం.. మురిసె త్రివర్ణం 7
7/8

సగర్వం.. మురిసె త్రివర్ణం

సగర్వం.. మురిసె త్రివర్ణం 8
8/8

సగర్వం.. మురిసె త్రివర్ణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement