ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..? | Weekly Horoscope Telugu 14-06-2026 To 20-06-2026 | Sakshi
Sakshi News home page

Weekly Horoscope In Telugu: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Jun 14 2026 2:42 AM | Updated on Jun 14 2026 4:49 AM

Weekly Horoscope Telugu 14-06-2026 To 20-06-2026

మేషం..
అవసరాలకు డబ్బు అందక ఇబ్బందులు ఎదురైనా అధిగిస్తారు. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. సోదరులతో ఆస్తి వివాదాలు. ఆత్మీయులతో విభేదాలు నెలకొనవచ్చు. కాంట్రాక్టర్లు నిరాశ చెందుతారు.  సన్నిహితులు వ్యవహారాలలో ఒత్తిడులు పెంచుతారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. విద్యార్థులు కష్టపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలలో  ఆశించిన లాభాలు దక్కక నిరుత్సాహం. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. కళారంగం వారికి సమస్యలు ఎదురుకావచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. నీలం, గులాబీ రంగులు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

వృషభం...
ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆప్తుల నుంచి కీలక సమాచారం రాగలదు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగులు, విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. స్థిరాస్తి విషయంలో ఒత్తిడులు తొలగుతాయి. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలను అధిగమిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారాలు విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో అనారోగ్యం. బంధువులతో మాటపట్టింపులు. ఎరుపు, నేరేడు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మిథునం...
ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం. ఆప్తుల సలహాలు పాటిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థుల శక్తిసామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. ఇంట్లో శుభకార్యాలపై చర్చలు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలు లాభాలబాట పడతారు. ఉద్యోగాలలో సంతోషకరమైన సమాచారం.  రాజకీయవర్గాలకు కొన్ని విజయాలు వరిస్తాయి. వారం ప్రారంభంలో బంధువులతో తగాదాలు. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు.  ఆదిత్య హృదయం పఠించండి.

కర్కాటకం...
సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. భూవివాదాలు పరిష్కారమవుతాయి. సంఘంలో ఆదరణ లభిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వివాహయత్నాలు సానుకూలమవుతాయి. విద్యార్థులకు భవిష్యత్తుపై భరోసా కలుగుతుంది. వ్యాపారాలు సమయానికి విస్తరిస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో మానసిక ఆందోళన. ఆరోగ్యసమస్యలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకుపచ్చ, నీలం రంగులు.  వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించండి.

సింహం...
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. గతం నుంచి వెంటాడుతున్న కొన్ని సమస్యలు తీరతాయి. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. పలుకుబడి పెరుగుతుంది. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.  పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. సమావేశాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. కళారంగం వారికి అనూహ్యమైన అవకాశాలు దక్కవచ్చు. వారం చివరిలో బంధువిరోధాలు. ఇంటాబయటా ఒత్తిడులు. గులాబీ, ఎరుపు రంగులు.  విష్ణుధ్యానం చేయండి.

కన్య...
రావలసిన సొమ్ము అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సమయానికి పూర్తి చేస్తారు. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. వాహన, గృహయోగాలు.  ప్రత్యర్థులను సైతం అనుకూలురుగా మార్చుకుంటారు. ఆరోగ్యం గతం కంటే మెరుగుపడుతుంది. దీక్షతో ముందుకు సాగి విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగాలలో మరింత అనుకూలం. వ్యాపారాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. లాభాలు తథ్యం. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్య, కుటుంబసమస్యలు. పసుపు, నేరేడు రంగులు.  దేవీఖడ్గమాల పఠించండి.

తుల...
అదనపు ఆదాయం సమకూరుతుంది. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. కాంట్రాక్టులు కొన్ని దక్కించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో  పనిభారం మరింత తగ్గుతుంది. కళాకారులకు అన్ని విధాలా అనుకూలం.  వారం ప్రారంభంలో బంధువిరోధాలు. పనిఒత్తిడులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు.  శివారాధన మంచిది.

వృశ్చికం...
అనుకున్న ఆదాయం లభించి ముందడుగు వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ప్రముఖ వ్యక్తులు పరిచయం. అందరిలోనూ మీ ప్రత్యేకత చాటుకుంటారు. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. భూవివాదాలు తీరతాయి.  వ్యాపారాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉద్యోగాలలో విధులు ప్రశాంతంగా సాగుతాయి.  రాజకీయవర్గాలకు ఊహించని పదవులు. వారం మధ్యలో మిత్రులతో కలహాలు. అనారోగ్య సూచనలు. శ్రమాధిక్యం. ఎరుపు, గులాబీ రంగులు.  సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

ధనుస్సు...
అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. బంధువులతో విభేదాలు పరిష్కారమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. సేవాకార్యక్రమాలపై దృష్టి పెడతారు. పరపతి కలిగిన వారితో పరిచయాలు. వాహనాలు సమకూర్చుకుంటారు. ఇంట్లో శుభకార్యాల సందడి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలలో అనూహ్యమైన లాభాలు. ఉద్యోగాలలో సత్తా చాటుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ఆశలు చిగురిస్తాయి. వారం చివరిలో ధననష్టం. అనారోగ్య సూచనలు. గులాబీ, తెలుపు రంగులు.  ఆంజనేయ దండకం పఠించండి.

మకరం..
రావలసిన డబ్బు అంది ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్య వ్యవహారాలలో విజయం. ఆప్తులతో వివాదాలు తీరతాయి. అందరిలోనూ విశేష గౌరవం పొందుతారు. వాహనాలు, స్థలాలు కొంటారు. నూతన పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.  ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో  ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. పారిశ్రామికవర్గాలకు ఊహించని అవకాశాలు.  వారం ప్రారంభంలో బంధువులతో కలహాలు. అనారోగ్యం. శ్రమ పెరుగుతుంది. పసుపు, ఆకుపచ్చ రంగులు.  హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

కుంభం...
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. కొన్ని వ్యవహారాలు మరింత సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి సహాయం అందుతుంది. ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగుపడతాయి. ఆలయాలు సందర్శిస్తారు. పరిచయాలు విస్తృతమవుతాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వాహనాలు, స్థలాలు కొంటారు. వ్యాపారాలు లాభాలదిశగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో క్లిష్టసమస్యలు తీరతాయి. పారిశ్రామికవర్గాల శ్రమ ఫలిస్తుంది. వారం ప్రారంభంలో మిత్రులతో విభేదాలు. అనుకోని ధనవ్యయం. గులాబీ, పసుపు రంగులు. దుర్గాస్తోత్రాలు పఠించండి.

మీనం....
ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. సేవ, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువుల రాకతో ఉత్సాహంగా గడుపుతారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. కొన్ని ముఖ్య సమావేశాలకు హాజరవుతారు. ప్రత్యర్థులను కూడా ఆకట్టుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. వ్యాపారాలలో సమస్యలు, చిక్కులు తొలగుతాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. మానసిక ఆందోళన. నేరేడు, పసుపు రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement