ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..? | Weekly Horoscope Telugu 07-06-2026 To 13-06-2026 | Sakshi
Sakshi News home page

Weekly Horoscope In Telugu: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Jun 7 2026 5:16 AM | Updated on Jun 7 2026 11:18 AM

Weekly Horoscope Telugu 07-06-2026 To 13-06-2026

మేషం...
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులు నుంచి ఆహ్వానాలు రాగలవు. ఆస్తి వివాదాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. విద్యార్థుల యత్నాలు సఫలం. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో అనుకోని ఖర్చులు. అనారోగ్యం. ఆకుపచ్చ, నేరేడు రంగులు,  దేవీస్తోత్రాలు పఠించండి.

వృషభం...
పరపతి పెరుగుతుంది. ప్రముఖ వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. విమర్శించిన వారే ప్రశంసిస్తారు. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. అనుకున్న విధంగా ఆదాయం సమకూరుతుంది. వ్యాపారాలలో అభివృద్ధి. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులకు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వారం చివరిలో అనారోగ్యం. వృథా ఖర్చులు. నీలం, ఆకుపచ్చ రంగులు, శ్రీ ఆంజనేయ స్తుతి మంచిది.

మిథునం....
ముఖ్యమైన పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి గతంతో పోలిస్తే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు యత్నాలు సఫలం. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన . చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా అనుకూలంగా మారతారు. పరిచయాలు పెరుగుతాయి.  తీర్థయాత్రలు చేస్తారు. వాక్చాతుర్యంతో అందర్నీ మెప్పిస్తారు. వ్యాపార లావాదేవీలు క్రమేపీ అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో స్వల్ప వివాదాలు. ఆరోగ్యపరమైన చికాకులు. ఎరుపు, గులాబీ రంగులు, శివాష్టకం పఠించండి.

కర్కాటకం...
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆశించిన రాబడి ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పలుకుబడి పెరుగుతుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు దక్కవచ్చు. కళాకారులకు ఊహించని అవకాశాలు. వారం ప్రారంభంలో మిత్రులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. నలుపు, లేత గులాబీ రంగులు, కనకధారాస్తోత్రాలు పఠించండి.

సింహం...
పనులు సక్రమంగా పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబసభ్యులతో మనస్పర్థలు తొలగుతాయి. విద్యార్థులు అనూహ్యమైన ఫలితాలు సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. భూములు, వాహనాలు కొంటారు. కొన్ని ముఖ్య కార్యక్రమాలకు హాజరవుతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు రాగలవు. కళాకారులకు సన్మానాలు. వారం మధ్యలో వృథా ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. గులాబీ, తెలుపు రంగులు, నృసింహస్తోత్రాలు పఠించండి.

కన్య...
ప్రముఖులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ధనలబ్ధి. వాహనయోగం. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. ఎరుపు, నేరేడు రంగులు, శ్రీరామస్తోత్రాలు పఠించండి.

తుల...
ఇంటాబయటా అనుకూల పరిస్థితి ఉంటుంది. సన్నిహితుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. పారిశ్రామికవర్గాలకు అరుదైన ఆహ్వానాలు రాగలవు. వారం ప్రారంభంలో చికాకులు. ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, లేత పసుపు రంగులు, ఆంజనేయ దండకం పఠించండి.

వృశ్చికం...
కొన్ని ఇబ్బందులు ఎదురైనా పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభాలబాటలో సాగుతాయి. ఉద్యోగస్తులకు గతం నుంచి వేధిస్తున్న సమస్యలు తీరతాయి. కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనుకోని ఖర్చులు. ఎరుపు, నేరేడు రంగులు,  హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు...
ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ఆత్మీయుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనయోగం. వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగులకు నూతనోత్సాహం. రాజకీయవర్గాలకు పదవులు దగ్గరకు వస్తాయి. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. పసుపు, నేరేడు రంగులు, గ ణేశాష్టకం పఠించండి.

మకరం...
పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసమస్యలు వేధిస్తాయి. బంధువులతో అకారణంగా విభేదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. విద్య, ఉద్యోగావకాశాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం. కళాకారులకు ఒత్తిడులు పెరుగుతాయి. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. లేత ఆకుపచ్చ, నేరేడు రంగులు,  దేవీఖడ్గమాల పఠించండి.

కుంభం...
ఆర్థిక లావాదేవీలు మొదట్లో కొంత ఇబ్బంది కలిగిస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెంపొందుతాయి. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. విద్యార్థుల ఆశలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. మానసిక అశాంతి. తెలుపు, ఆకుపచ్చ రంగులు,  నవగ్రహస్తోత్రాలు పఠించండి.

మీనం...
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు సన్మానాలు జరుగుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. ధనవ్యయం. ఎరుపు, బంగారు రంగులు, హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement