గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, తిథి: అమావాస్య ఉ.9.15 వరకు, తదుపరి నిజజ్యేష్ఠ శుద్ధ పాడ్యమి, నక్షత్రం: మృగశిర రా.9.09 వరకు, తదుపరి ఆరుద్ర, వర్జ్యం: తె.4.58 నుండి 6.27 వరకు (తెల్లవారితే మంగళ వారం), దుర్ముహూర్తం: ప.12.26 నుండి 1.18 వరకు, తదుపరి ప.3.02 నుండి 3.54 వరకు, అమృత ఘడియలు: ప.12.56 నుండి 2.26 వరకు.
సూర్యోదయం : 5.28
సూర్యాస్తమయం : 6.30
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
మేషం... వ్యవహారాలలో ఆటంకాలు. ప్రయాణాలు విరమిస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి.
వృషభం... పనుల్లో విజయం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు.
మిథునం.... బంధువులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యయప్రయాసలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటుంది.
కర్కాటకం... పాతబాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.
సింహం.... కొత్త విషయాలు గ్రహిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. ప్రముఖుల పరిచయం. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
కన్య.... ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబసమస్యలు. మిత్రులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.
తుల... ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా నిరుత్సాహం. ఆరోగ్యభంగం. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
వృశ్చికం.... కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. పరిచయాలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి.
ధనుస్సు.... విద్యార్థులకు అనుకూల పరిస్థితులు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మకరం.... ఆర్థిక ఇబ్బందులు. పనుల్లో ప్రతిబంధకాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో నిరాశ.
కుంభం.... శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యయప్రయాసలు. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం.
మీనం.... రుణఒత్తిడులు తొలగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆహ్వానాలు అందుతాయి. పనులు సకాలంలో పూర్తి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.


