ఈ రాశి వారికి మిత్రుల నుంచి ధనలబ్ధి | Rasi Phalalu: Daily Horoscope On 11-06-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి మిత్రుల నుంచి ధనలబ్ధి

Jun 11 2026 3:06 AM | Updated on Jun 11 2026 5:07 AM

Rasi Phalalu: Daily Horoscope On 11-06-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధికజ్యేష్ఠ మాసం, తిథి: బ.ఏకాదశి సా.6.10 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: అశ్విని రా.3.08 వరకు, తదుపరి భరణి, వర్జ్యం: రా.11.17 నుండి 12.49 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.48 నుండి 10.40 వరకు, తదుపరి ప.3.01 నుండి 3.53 వరకు, అమృత ఘడియలు: రా.8.11 నుండి 9.44 వరకు, సర్వ ఏకాదశి.

సూర్యోదయం : 5.28
సూర్యాస్తమయం : 6.30
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు 

మేషం... కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.

వృషభం... వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

మిథునం.... పనులు సకాలంలో పూర్తి. సమాజసేవలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. కీలక నిర్ణయాలు. కుటుంబంలో శుభకార్యాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సానుకూల వాతావరణం.

కర్కాటకం... ముఖ్యమైన వ్యవహారాలలో విజయం. మిత్రుల నుంచి ధనలబ్ధి. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. స్థిరాస్తి ఒప్పందాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు అధిగమిస్తారు.

సింహం.... నిర్ణయాలలో మార్పులు. ఆర్థిక ఇబ్బందులు. వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలలో ఆటంకాలు. మిత్రులు, బంధువులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.

కన్య........ కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళపరుస్తాయి.

తుల... నూతన వ్యక్తుల పరిచయం. వేడుకల నిర్వహణలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

వృశ్చికం... కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో మంచీచెడ్డా విచారిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ప్రయాణాలు రద్దు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

ధనుస్సు... రుణ యత్నాలు ముమ్మరం చేస్తారు. అనుకున్న పనులలో జాప్యం. ఆలోచనలు కలసిరావు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో పనిభారం.

మకరం.... సన్నిహితులతో మాటపట్టింపులు. ఆర్థిక పరిస్థితి అంతగా కలసిరాదు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కుంభం.. కొత్త పనులు ప్రారంభం. శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధువులతో విభేదాలు తొలగుతాయి. వస్తులాభాలు. పాత విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

మీనం... చేపట్టిన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.

Advertisement
 
Advertisement
Advertisement