ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు | Rasi Phalalu: Daily Horoscope On 10-06-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు

Jun 10 2026 3:22 AM | Updated on Jun 10 2026 3:22 AM

Rasi Phalalu: Daily Horoscope On 10-06-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధికజ్యేష్ఠ మాసం, తిథి: బ.దశమి రా.7.47 వరకు తదుపరి ఏకాదశి, నక్షత్రం: రేవతి తె.4.06 వరకు (తెల్లవారితే గురువారం), తదుపరి అశ్విని, వర్జ్యం: సా.4.25 నుండి 5.58 వరకు, దుర్ముహూర్తం: ప.11.32 నుండి 12.24 వరకు, అమృత ఘడియలు: రా.1.45 నుండి 3.20 వరకు.

సూర్యోదయం :    5.28
సూర్యాస్తమయం    :  6.29
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుండి 9.00 వరకు 

మేషం: దూరప్రయాణాలు. సన్నిహితులతో వివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. పనుల్లో అవాంతరాలు. నిరుద్యోగుల యత్నాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు ఎదురుకావచ్చు.

వృషభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

మిథునం: పనులు సజావుగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. విద్యార్థులకు ఊరట. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.

కర్కాటకం: ప్రయాణాలు వాయిదా వేస్తారు. అనుకున్న వ్యవహారాలలో అవాంతరాలు. సోదరులతో విభేదాలు. అనారోగ్యం. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి. దైవచింతన.

సింహం: ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో కొద్దిపాటి వివాదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.

కన్య: దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కుల నుంచి బయటపడతారు.

తుల: ముఖ్య వ్యవహారాలలో పురోగతి. నూతన విద్యావకాశాలు. పలుకుబడి పెరుగుతుంది. బంధువుల సలహాలు స్వీకరిస్తారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాల వైపు సాగుతారు.

వృశ్చికం: అనుకున్న పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. మిత్రులు, బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

ధనుస్సు: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. కొత్త రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమ మరింత పెరుగుతుంది. పనులు నిదానిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప చికాకులు.

మకరం:  ఆప్తులతో సఖ్యత. విందువినోదాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. కొన్ని వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

కుంభం: వ్యవహారాలలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన. ప్రయాణాలు వాయిదా వేస్తారు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశపరుస్తాయి.

మీనం: సమావేశాలలో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. బంధువులతో సఖ్యత. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు.  ఉద్యోగాలలో ప్రోత్సాహకరం.

Advertisement
 
Advertisement
Advertisement