గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధికజ్యేష్ఠ మాసం, తిథి: బ.నవమి రా.9.02 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: ఉత్తరాభాద్ర తె.4.44 వరకు (తెల్లవారితే బుధవారం), తదుపరి రేవతి, వర్జ్యం: ప.2.28 నుండి 4.03 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.04 నుండి 8.56 వరకు, తదుపరి రా.10.52 నుండి 11.36 వరకు,అమృత ఘడియలు: రా.11.59 నుండి 1.33 వరకు.
సూర్యోదయం : 5.28
సూర్యాస్తమయం : 6.29
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
మేషం: ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులు ఒత్తిళ్లు పెంచుతారు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి శ్రమాధిక్యం. ఉద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
వృషభం: కొత్త నిర్ణయాలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సానుకూలత.
మిథునం: పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనాలు కొంటారు. పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
కర్కాటకం: కొత్త పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. బంధువులను కలుసుకుంటారు. అనుకోని ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
సింహం: వ్యవహారాలలో జాప్యం. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. పరిస్థితులు అనుకూలించవు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
కన్య: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తిలాభం. నూతన పరిచయాలు. సంఘంలో ఆదరణ. వాహనాలు, ఆభరణాలు కొంటారు. కొన్ని వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
తుల: మిత్రులతో సఖ్యత. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. ఆస్తుల వ్యవహారాలలో సమస్యలు తీరతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.
వృశ్చికం: రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో స్వల్ప వివాదాలు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
ధనుస్సు: కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. అనుకోని ప్రయాణాలు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
మకరం: పరిచయాలు పెరుగుతాయి. కొత్త పదవులు దక్కించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. విందువినోదాలు.
కుంభం: కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యభంగం. చిన్ననాటి మిత్రుల కలయిక. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.
మీనం: వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలయ దర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది.


