గ్రహం అనుగ్రహం (14-09-2020)

Daily Horoscope In Telugu (14-09-2020) - Sakshi

శ్రీశార్వరినామ సంవత్సరం. దక్షిణాయనం, వర్ష ఋతువు. భాద్రపద మాసం. తిథి బ.ద్వాదశి రా.10.01 వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం పుష్యమి ప.1.23 వరకు, తదుపరి ఆశ్లేష. వర్జ్యం రా.1.54 నుంచి 3.26 వరకు. దుర్ముహూర్తం ప.12.19 నుంచి 1.10 వరకు, తదుపరి ప.2.46 నుంచి 3.35 వరకు. అమృత ఘడియలు ఉ.6.56 నుంచి 8.32 వరకు

సూర్యోదయం: 5.50
సూర్యాస్తమయం: 6.03
రాహుకాలం :  ఉ.7.30 నుంచి  9.00 వరకు.
యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు

మేషం : ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. పనులు ముందుకు సాగవు. బంధువుల నుంచి ఒత్తిడులు. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

వృషభం : పరిచయాలు పెరుగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. వాహనసౌఖ్యం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

మిథునం : ముఖ్య కార్యక్రమాలు మందగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా సాగుతాయి.

కర్కాటకం : కొత్త పరిచయాలు. శుభవార్తలు వింటారు. ధనప్రాప్తి. సంఘంలో గౌరవం లభిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

సింహం : శ్రమానంతరం పనులు పూర్తి. సేవాకార్యక్రమాలు చేపడతారు.  స్థిరాస్తి వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు.వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.

కన్య : కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఆత్మీయుల నుంచి పిలుపు. సోదరులతో సఖ్యత. కొత్త విషయాలు తెలుస్తాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

తుల : ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విచిత్ర సంఘటనలు. వస్తులాభాలు. మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

వృశ్చికం : మిత్రులతో అకారణంగా తగాదాలు. శ్రమ పెరుగుతుంది. పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు సాగిస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు.

ధనుస్సు : కొత్తగా రుణాలు చేస్తారు. అనుకున్న పనుల్లో తొందరపాటు. ఆరోగ్యసమస్యలు. కుటుంబసభ్యులతో తగాదాలు. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు.

మకరం : కొత్త పరిచయాలు సంతోషాన్నిస్తాయి. సంఘంలో విశేష గౌరవం. ఆస్తి ఒప్పందాలు. మిత్రులతో సఖ్యత. ధన, వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

కుంభం : ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. పనులు చకచకా పూర్తి చేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. మీ సత్తా చాటుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మీనం : సన్నిహితులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో నిరాశ.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top