దాడిచేసి పత్రాలు లాక్కొన్నారు | - | Sakshi
Sakshi News home page

దాడిచేసి పత్రాలు లాక్కొన్నారు

Nov 19 2026 2:43 AM | Updated on Nov 19 2026 2:43 AM

● నామినేషన్‌ వేసేందుకు

పోలీసులు రక్షణ కల్పించాలి

● వేడుకొన్న సర్పంచ్‌ అభ్యర్థి లక్ష్మి

● అసభ్యకరంగా ప్రవర్తించారని ఆవేదన

సాక్షి టాస్క్‌పోర్స్‌: తెలుగుదేశం పార్టీ గూండాల దాడులు, విధ్వంసక చర్యలతో గ్రామాల్లో చిచ్చురేగుతోంది. సర్పంచ్‌ నామినేషన్ల తొలి రోజు బుధవారం పుంగనూరు మండలంలో బండ్లపల్లె సర్పంచ్‌ పదవికి నామినేషన్‌ దాఖలు చేసేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ మద్దతు అభ్యర్థి పి.సౌందర్య పై దాడులు చేశారు. ఆమె కారు ధ్వంసం చేసి, నామినేషన్‌ పత్రాలు లాకెళ్లారు. అలాగే మంగళం వైఎస్సార్‌సీపీ మద్దతు సర్పంచ్‌ అభ్యర్థి సరస్వతమ్మ నామినేషన్‌ వేసేందుకు వెళ్తుండగా తెలుగుదేశం గూండాలు అడ్డుకుని కారు అద్దాలు పగులగొట్టి, నామినేషన్‌ పత్రాలు లాకెళ్లారు. ఇరువురు అభ్యర్థులు ఒరిజనల్‌ నామినేషన్‌ పత్రాలను దాచుకుని చేతిలో డమ్మి పత్రాలను తీసుకొస్తుండగా వాటిని లాకెళ్లి చించివేశారు. మారణాయుధాలతో దాడులు చేసినా వీరు వెరవకుండా నామినేషన్లు దాఖలు చేశారు.

రొంపిచర్లలో అరాచకం..

టాస్క్‌ఫోర్స్‌: చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని రొంపిచెర్ల మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లు వేసేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ మద్దతు నాయకులను కార్యకర్తలను అభ్యర్థులను టీడీపీ వర్గీయులు దాడులు చేసి అడ్డుకున్నారు. గానుగచింత, మోటుమల్లెల, రొంపిచెర్ల బోడిపాటివారిపల్లె గ్రామ పంచాయతీలకు కలిపి రొంపిచెర్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో బుధవారం ఉదయం నాలుగు గ్రామ పంచాయతీల సర్పంచ్‌, వార్డు మెంబర్ల అభ్యర్థుఽలు నామినేషన్లు వేసేందుకు రావడంతో అందరిపై టీడీపీ వర్గీయులు రౌడీలతో దాడి చేయించి కొట్టా రు. ఈ దాడిలో మాజీ జెడ్పీటీసీ రెడ్డిశ్వర్‌ రెడ్డి, బోడిపాటివారిపల్లె మాజీ సర్పంచ్‌ ప్రసాద్‌ నాయుడు గాయ పడ్డారు. దీంతో వైఎస్సార్‌సీపీ వర్గీయులు అక్కడే ధర్నా చేపట్టారు. పోలీసులు డౌన్‌ డౌన్‌ అంటు నినాదాలు చేశారు. ఒక పక్క పోలీసులు సైతం అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా పని చేశారు. నామినేషన్‌ కేంద్రానికి అందరూ ఒక సారిగా వెళ్లడంతో నామినేషన్‌ కేంద్రం గేట్లకు టీడీపీ వర్గీయులు తాళాలు వేసి ఎవరూవెళ్లుకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు అందరి దగ్గర మరో రోజు నామినేషన్లు వేయిస్తామని హామీ ఇచ్చారు.

జిల్లా ఎస్పీ, కలెక్టర్‌కు ఫిర్యాదు..

రొంపిచెర్ల మండలంలోని పది గ్రామ పంచాయతీలలో నామినేషన్లు వేయకుండా టీడీపీ రౌడీలు అడ్డుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. దీంతో అందరికి పోలీసు బందో బస్తు ఏర్పాటు చేసి నామినేషన్లు వేయిస్తామని ఎస్పీ, కలెక్టర్‌ హామీ ఇచ్చారు. అయితే గురువారం ఏమి జరుగుతుందోనని రొంపిచెర్ల మండలంలో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గత 50 సంవత్సరాలుగా ఇలాంటి గొడవలు మండలంలో ఎక్కడా జరగలేదని కూటమి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు.

నామినేషన్లు వేయనివ్వ లేదని

రాయవారిపల్లెలో ధర్నా ..

పులిచెర్ల మండలంలో కూడా వైఎస్సార్‌సీపీ మద్దతు అభ్యర్థుల నామినేషన్లును వేయకుండా టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో రాయవారిపల్లెలో వైఎస్సార్‌సీపీ నాయకులు అభ్యర్థులతో కలసి ధర్నా చేశారు. కమ్మపల్లెలో వైఎస్సార్‌సీపీకి చెందిన నాయకులు వచ్చిన ఆటోపై దాడి చేసి అద్దాలు పగలకొట్టారు. పులిచెర్ల గ్రామ పంచాయతీలో పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి వర్గీయులు కొట్టుకున్నారు. చల్లా రామచంద్రారెడ్డి పెత్తనం పులిచెర్లలో ఎందుకని అడ్డుకుని దాడి చేశారు. కల్లూరు గ్రామ పంచాయతీలో సైతం వైఎస్సార్‌సీపీ మద్దతు అభ్యర్థులను ఎవరినీ రానివ్వకుండా అడ్డు కున్నారు. దీంతో జిల్లా ఎస్పీ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

ఫొటోరైటప్‌

18పిజిఆర్‌01 పుంగనూరు మండలం బండ్లపల్లె వైఎస్సార్‌సిపి అభ్యర్థి వచ్చిన కారును గుండ్లు ధ్వంసం చేసిన తెలుగుదేశం పార్టీ గూండాలు.

18పిజిఆర్‌02 పుంగనూరు మండలం మంగళం సర్పంచ్‌ పదవికి ధైర్యంగా నామినేషన్‌ దాఖలు చేసిన సరస్వతమ్మ.

18పిజిఆర్‌03 పుంగనూరు మండలం బండ్లపల్లె సర్పంచ్‌ పదవికి ధైర్యంగా నామినేషన్‌ దాఖలు చేసిన పి.సౌందర్య.

18పిజిఆర్‌ 04 పుంగనూరు మండలం మంగళం అభ్యర్థి సరస్వతమ్మ జీపు అద్దాలు పగులగొట్టిన తెలుగుదేశం గూండాలు.

18పిజిఆర్‌81: రొంపిచెర్ల కూడలిలో ధర్నా చేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు అభ్యుర్థులు

–18పిజిఆర్‌82: రొంపిచెర్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అడ్డుకుంటున్న ఎస్‌ఐ మధుసూధన్‌

–18పిజిఆర్‌83: రొంపిచెర్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులు చేస్తున్న టీడీపీ వర్గీయులు

–18పిజిఆర్‌84: రొంపిచెర్లలో నామినేషన్లు వేసేందుకు వస్తున్న వారిని పోలీసులు అడ్డు కోవడంతో నడిచి వస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు అభ్యర్థులు

––––––––––––––––––––––––

– 18 పిజిఆర్‌ 85: పులిచెర్ల మండలం రాయవారిపల్లెలో ధర్నా చేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు

– 18 పిజిఆర్‌ 86: పులిచెర్ల మండలం కమ్మపల్లెలో వైఎస్సార్‌సీపీ నాయకులు వచ్చిన ఆటోపై దాడి చేసి అద్దాలు పగలగొట్టిన టీడీపీ వర్గీయులు

పుంగనూరు, రొంపిచర్లలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై టీడీపీ శ్రేణుల దాడి

మారణాయుధాలతో అభ్యర్థులపై దాడులు , వారి కార్లు ధ్వంసం

నామినేషన్లు చించివేత

మహిళా అభ్యర్థులపై దౌర్జన్యం

రొంపిచెర్లలో నాలుగు రోడ్ల కూడలిలో వైఎస్సార్‌సీపీ నాయకుల ధర్నా

నామినేషన్లు వేయించాలని డిమాండ్‌

చిత్తూరు జిల్లా ఎస్పీ, కలెక్టర్‌కు ఫిర్యాదు

చౌడేపల్లె: సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్‌ వేయడానికి వెళ్తే టీడీపీ శ్రేణులు అడ్డుకొంటున్నాయని, తమకు రక్షణ కల్పించి నామినేషన్‌ కేంద్రం వద్దకు తీసుకెళ్ళి నామినేషన్‌ వేయించాలని దుర్గసముద్రం పంచాయతీ సర్పంచ్‌ అభ్యర్థి కె. లక్ష్మి బుధవారం రాత్రి పొలీసులకు వినతిచేశారు. శెట్టిపేట వద్ద గల నామినేషన్‌ స్వీకరణ కేంద్రానికి వెళ్తుండగా తనను కొట్టి అసభ్యకరంగా ప్రవర్తించి దాచిపెట్టుకొన్న నామినేషన్‌ పత్రాలను లాక్కొని వెళ్లారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులు మహిళ అనిసైతం కూడా చూడకుండా ప్రవర్తించారని పొలీసులకు తెలిపారు. పోలీసులు జోక్యం చేసుకొని తన వద్ద నామినేషన్‌ వేయించడానికి చర్యలు చేపట్టాలని వేడుకొన్నారు.

– అలాగే శెట్టిపేట పంచాయతీ సర్పంచ్‌ అభ్యర్థి కమలమ్మ సైతం తనకు పోలీసుల రక్షణ మధ్య నామినేషన్‌ వేయించాలని పోలీసులకు వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement