ఇల్లు రాసి ఇవ్వలేదని కన్నవారిపై కర్కశత్వం | - | Sakshi
Sakshi News home page

ఇల్లు రాసి ఇవ్వలేదని కన్నవారిపై కర్కశత్వం

Nov 19 2026 2:43 AM | Updated on Nov 19 2026 2:43 AM

మదనపల్లె టౌన్‌ : ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులనే కడతేర్చడానికి వెనుకాడని ఘటన పెద్దమండెం మండలంలో బుధవారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. వెలిగల్లు తురకపల్లికి చెందిన ముస్తఫా, ఆయేషా దంపతుల కుమారుడు నవాజ్‌. తనకు, తన భార్య జాకీరాకు ఇల్లు రాసివ్వాలని తల్లిదండ్రులతో నవాజ్‌ కొంతకాలంగా గొడవపడుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం మరోసారి వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.మాటమాట పెరగడంతో ఆగ్రహానికి గురైన నవాజ్‌, ఇంట్లోని ఇనుపరాడ్డుతో తల్లిదండ్రులపై దాడి చేశాడు. ఈ దాడిలో దంపతులిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి, బాధితులను చికిత్స నిమిత్తం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు మెరుగైన చికిత్స అందించడంతో దంపతులు కోలుకుంటున్నారు. ఘటనపై పెద్దమండెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గాయపడిన ముస్తఫా, ఆయేషా

తల్లిదండ్రులపై ఇనుపరాడ్డుతో తనయుడి దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement