మదనపల్లె టౌన్ : పంచాయతీ ఎన్నికల విధుల నిమిత్తం గ్రామాల సందర్శనకు వెళ్తూ జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దమండెం హెడ్ కానిస్టేబుల్ పి. రాజేష్‌బాబు (హెచ్‌సీ–3427) మంగళవారం దుర్మరణం పాలయ్యారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పెద్దమండెం మండలం కలిచెర్ల పెట్రోల్ బంక్ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి కిందపడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. మృతుడికి భార్య పి. శ్యామల, ఇద్దరు కవల ఆడపిల్లలు ఉన్నారు.
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు..
రాజేష్‌బాబు అకాల మరణంపై ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, డీఎస్పీ ప్రసాద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీ సు అధికారులు బుధవారం పుంగనూరు మండలం ఏటివాకిలి గ్రామంలో రాజేష్‌బాబు మృతదేహానికి నివాళులర్పించారు. దహన సంస్కారాల నిమిత్తం మృతుడి భార్యకు రూ. లక్ష తక్షణ ఆర్థిక సాయాన్ని అందజేశారు. అనంతరం అధికారిక పోలీసు లాంఛనాల నడుమ రాజేష్‌బాబు అంత్యక్రియలను నిర్వహించారు.
రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి


