ఆసుపత్రికి వెళ్లొచ్చేసరికి.. అపహరించారు | - | Sakshi
Sakshi News home page

ఆసుపత్రికి వెళ్లొచ్చేసరికి.. అపహరించారు

Nov 19 2026 2:43 AM | Updated on Nov 19 2026 2:43 AM

కురబలకోట : మనవడికి మెరుగైన వైద్యం అందించేందుకు ఆసుపత్రికి వెళ్లిన ఆ కుటుంబానికి దొంగలు ఊహించని షాక్‌ ఇచ్చారు. ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని అదునుగా తీసుకుని దుండగులు తాళాలు పగులగొట్టి అందినకాడికి దోచుకెళ్లారు. ఈ ఘటన మండలంలోని అంగళ్లు గ్రామం కమతంపల్లిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు...కమతంపల్లికి చెందిన డ్రైవర్‌ షేక్‌ ఖాదర్‌వలీ మనవడికి అనారోగ్యం కారణంగా మెరుగైన వైద్య సేవల నిమిత్తం కుటుంబ సభ్యులతో కలసి మదనపల్లెలోని ఆసుపత్రికి వెళ్లారు. రాత్రి అక్కడే ఉండిపోవాల్సి రావడంతో ఇంట్లో ఎవరూ లేరు. ఇదే అదునుగా ఇంటి తాళాలు పగుల గొట్టి ఇంటిలోకి ప్రవేశించి బీరువాలో దాచిన రెండు చిన్నారుల రెండు బంగారు ఉంగరాలు, 400 గ్రాముల వెండి నగలతో పాటు రూ.50 వేల నగదు అపహరించుకని వెళ్లారు. బుధవారం ఉదయం స్థానికులు గమనించి బాధితులకు సమాచారం ఇచ్చారు. షేక్‌ ఖాధర్‌ వల్లి ఫిర్యాదు మేరకు ముదివేడు ఎస్‌ఐ మధు రామచంద్రుడు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement