పోలీసుల అదుపులో వైఎస్సార్‌ సీపీ నాయకులు | - | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో వైఎస్సార్‌ సీపీ నాయకులు

Nov 18 2026 1:38 AM | Updated on Nov 18 2026 1:38 AM

గాలివీడు : మండలానికి చెందిన ఇద్దరు కీలక వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ మిట్టపల్లి యదుభూషన్‌ రెడ్డి, అరవీడుకు చెందిన నాయకుడు కూర్మయగారి రమేష్‌ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.మంగళవారం నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో శాంతిభద్రతల పేరుతో తమ పార్టీ నాయకులను అదుపులోకి తీసుకుని వేధించడం దారుణమని వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గ్రామ పంచాయతీలను ఏకగ్రీవం చేసుకునే ఉద్దేశంతోనే తమ నాయకులపై ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నాయి.

అంగళ్లులో చిన్నారిపై

పిచ్చికుక్క దాడి

మదనపల్లె టౌన్‌ : అంగళ్లులో మంగళవారం చిన్నారిపై పిచ్చికుక్క దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. అంగళ్లకు చెందిన హాసిని (01) ఇంటి ముందు ఆడుకుంటుండగా పిచ్చికుక్క ఒక్కసారిగా దాడి చేసింది. ఊహించని దాడితో చిన్నారి భయంతో కేకలు వేసింది. కేకలు విని కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు పరుగున వచ్చి కుక్కను తరిమివేశారు. దాడిలో చిన్నారి తీవ్రంగా గాయపడింది. ముఖం, చేతులు, కాళ్లపై గాయాలయ్యాయి. వెంటనే కుటుంబీకులు చిన్నారిని చికిత్స కోసం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు గాయాలకు చికిత్స అందించి, రేబిస్‌ రాకుండా వ్యాక్సిన్‌ వేశారు. గ్రామంలో పిచ్చికుక్కల బెడద రోజు రోజుకు ఎక్కువవుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు, వృద్ధులు బయటకు రావడానికి భయపడుతున్నారని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి కుక్కలను నియంత్రించాల్సి ఉంది

బస్సును ఢీ కొన్న లారీ

దువ్వూరు : మండలంలోని కానగూడూరు వద్ద ఉన్న కడప కర్నూలు జాతీయ రహదారిపై తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికుల వివరాల మేరకు ..కడప వైపు నుండి కర్నూలుకు వెళుతున్న ట్రేలర్‌ లారీ కానగూడూరు వద్ద ఉన్న ఇండేన్‌ పెట్రోలు బంకు వద్దకు రాగానే అదుపు తప్పి రోడ్డు డివైడర్‌ను దాటి ఆళ్లగడ్డ నుండి మైదుకూరుకు వెళుతున్న పల్లెవెలుగు ఆర్టీసీ బస్సును ముందు వైపు ఢీకొంది. సమయస్ఫూర్తితో బస్సు డ్రైవర్‌ పక్కనున్న పొలాల్లోకి బస్సును మళ్లించాడు. లారీ కూడా పక్కనున్న పొలాల్లోకి వెళ్లి ఆగిపోయింది. ఈ ఘటనను స్థానికులు గమనించి బస్సు దగ్గరకు వెళ్లి అందులోని ప్రయాణికులను కిందికి దించారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సు డ్రైవర్‌ సమయస్ఫూర్తితో వ్యహరించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెప్పా రు. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement