రోడ్డు ప్రమాదంలో హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి

Nov 18 2026 1:38 AM | Updated on Nov 18 2026 1:38 AM

మదనపల్లె టౌన్‌ : విధి నిర్వహణలో భాగంగా బైక్‌పై వెళ్తున్న పెద్దమండ్యం హెడ్‌ కానిస్టేబుల్‌ పొట్టిపాడు రాజేష్‌ (50) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మంగళవారం పెద్దమండ్యం సమీపంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

గుండె నొప్పితో బైక్‌పై నుంచి కిందపడ్డ రాజేష్‌

ఘటనపై పెద్దమండెం ఎస్‌ఐ నరసింహుడు మీడియాకు తెలిపిన వివరాలు.. పెద్దమండెం పోలీస్‌ స్టేషన్‌ నుంచి పెద్దమండ్యం టౌన్‌న్‌లోకి బైక్‌పై ఎన్నికల విధులకు సహచర కానిస్టేబుల్‌తో వెళ్తుండగా, పోలీస్‌ స్టేషన్‌కు సమీపంలోనే అకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో సహచర కానిస్టేబుల్‌ బైక్‌ వెనక కూర్చున్న రాజేష్‌ అదుపుతప్పి రోడ్డుపై పడ్డారని చెప్పారు. తీవ్రంగా గాయపడిన ఆయనను సహచర సిబ్బంది వెంటనే గుర్రంకొండకు తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో డాక్టర్లు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, రాజేష్‌ మృతి చెందారని ఎస్‌ఐ తెలిపారు.

తిరుపతి పట్టణానికి చెందిన రాజేష్‌ 1995 బ్యాచ్‌కు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌. ఇటీవల మదనపల్లె రెండవ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ నుంచి పెద్దమండ్యంకు బదిలీపై వెళ్లి విధులు నిర్వర్తిస్తున్నారు. దీర్ఘకాలం పోలీసు శాఖలో నిబద్ధతతో పనిచేసిన ఆయన మృతితో సహచర సిబ్బంది కన్నీరు పెట్టుకున్నారు. మృతుడికి భార్య శ్యామల, ఇద్దరు కవల కుమార్తెలు ఉన్నారని ఎస్‌ఐ తెలిపారు. మృతుడి బావమరిది కృష్ణమూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement