ప్రజలు విజ్ఞత ప్రదర్శించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలు విజ్ఞత ప్రదర్శించాలి

Oct 24 2026 4:53 AM | Updated on Oct 24 2026 4:53 AM

సాక్షి, మదనపల్లె : మదనపల్లె అభివృద్ధికి వైఎస్సార్‌సీపీ చిత్తశుద్ధితో పని చేసింది, జగనన్న పాలనలో జరిగిన అభివృద్ధి మీ కళ్ల ముందే కనిపిస్తోంది, మదనపల్లె ప్రజలు విజ్ఞత ప్రదర్శించి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ చైర్మన్‌, వార్డు అభ్యర్థులను గెలిపించాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి కోరారు. శుక్రవారం స్థానిక దేశాయి ఫంక్షన్‌ హాల్‌లో మున్సిపల్‌ ఎన్నికలపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మదనపల్లె అభివృద్ధి కోసం కేంద్రీయ విద్యాలయం, రూ.475 కోట్లతో మెడికల్‌ కళాశాల, జాతీయ రహదారుల అభివృద్ధి, విద్యా విద్య రంగాల్లో అభివృద్ధి, బీటీ కళాశాలను యూనివర్సిటీగా చేశామన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు, మున్సిపాలిటీలో ఐదేళ్లలో రూ.200 కోట్లతో అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు జరిగిందన్నారు. ఈ క్రమంలో పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందకుండా చంద్రబాబు మెడికల్‌ కళాశాల పనులు ఆపించి, ప్రైవేటుకు అప్పగించేందుకు ప్రయత్నించారన్నారు. బీటీ కళాశాలను తమ ప్రభుత్వంలో స్వాధీనం చేసుకొని విద్యాభివృద్ధికి కృషి చేస్తే.. చంద్రబాబు ప్రభుత్వం విస్మరించిందన్నారు. పుంగనూరు తరహాలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్‌ వేయకుండా దాడులు చేయడం, అక్రమ కేసులు పెట్టి వేధిస్తే భయపడేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం జరుగుతోందని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ఎన్నికల ఘటనలపై సుప్రీంకోర్టు స్పందించాల్సి వచ్చిందంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వం అధికార దుర్వినియోగంతో కాకుండా ప్రజల్లోకి వెళ్లి ఓటర్ల మద్దతుతో సాధించేదే నిజమైన విజయమని అన్నారు. పార్టీ వార్డు అభ్యర్థులు, పాత వార్డుల మాజీ కౌన్సిలర్లు, నాయకులు సమన్వయంతో ప్రచారం నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉందని, పార్టీ ప్రచారం ఇంటింటికి చేరాలని సూచన చేశారు.

ప్రజల మద్దతు కోల్పోయిన కూటమి

మాజీ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి, సమన్వయకర్త నిసార్‌ అహ్మద్‌, మాజీ ఎమ్మెల్సీ నరేష్‌ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక పాలనతో కూటమి ప్రభుత్వం ప్రజల మద్దతు కోల్పోయిందని అన్నారు. పార్టీకి అనుభవం కలిగిన నేతలు ఉన్నారని, వారి దిశా నిర్దేశంలో మదనపల్లిలో విజయం సాధించాలన్నారు. పార్టీ పరిశీలకురాలు ఎన్‌.అనీషారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల నిబంధనల మేరకు అభ్యర్థులు, ఏజెంట్లు పని చేయాలన్నారు.

సమష్టిగా కృషి చేస్తే విజయం

చైర్మన్‌ అభ్యర్థి జింకా వెంకట చలపతి మాట్లాడుతూ పార్టీ చైర్మన్‌ అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పారు. పోలింగ్‌ రోజు ఎన్నికల ఏజెంట్ల పాత్ర కీలకమని, సమష్టిగా కృషి చేస్తే విజయం తథ్యమన్నారు. మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ మనుజా, మాజీ వైస్‌ చైర్మన్‌ నూర్‌ ఆజం, మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి విఎస్‌.రెడ్డి తదితరులు ఎన్నికల సన్నాహాలు, వార్డుల వారీగా సమన్వయం, పోలింగ్‌కు సంబంధించిన జాగ్రత్తలపై సూచనలు అందించారు. ఈ సమావేశంలో 48 వార్డులకు చెందిన అభ్యర్థులు, ఏజెంట్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అభివృద్ధి చేసింది ఎవరో గుర్తించాలి

వైఎస్సార్‌సీపీని ఎవరూ భయపెట్టలేరు

రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement