పెద్ద తిప్పసముద్రం : మండలంలోని సంపతి కోట పంచాయతీ కానగమాకులపల్లిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. అన్నమయ్య జిల్లా ములకలచెరువుకు చెందిన గంగులప్ప(35) సొంత పనిపై శుక్రవారం కర్ణాటక రాష్ట్రం యనమలపాడికి ద్విచక్ర వాహనంలో వెళ్లాడు. అక్కడ పని ముగించుకుని స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఖాళీ టమోటా బాక్సులతో ఎదురుగా వస్తున్న మినీ లారీ ద్విచక్ర వాహనదారుడిని ఢీకొని వేగంగా ముందుకు వెళ్లిపోయింది. అంతేగాక డ్రైవర్ మినీ లారీని ఆపకుండా వెళ్లిపోయాడు. ఈ ఘటనలో గంగులప్ప తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం బి కొత్తకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మదనపల్లికి ఆసుపత్రికి తరలించారు.


