లైంగిక దాడి, హత్య కేసులో జీవిత ఖైదు | - | Sakshi
Sakshi News home page

లైంగిక దాడి, హత్య కేసులో జీవిత ఖైదు

Oct 24 2026 4:53 AM | Updated on Oct 24 2026 4:53 AM

కేవీపల్లె : ఎనిమిదేళ్ల బాలుడిపై లైంగిక దాడి, హత్య చేసిన ఘటనలో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ చిత్తూరు పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అరుణసారిక తీర్పు చెప్పినట్లు ఎస్‌ఐ వెంకటశివకుమార్‌ తెలిపారు. వివరాలిలా వున్నాయి. 2021 అక్టోబర్‌ 12న మండలంలోని ఎంవీపల్లె పంచాయతీ ఎగువమేకలవారిపల్లెకు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు అదృశ్యమైనట్లు కేవీపల్లె పోలీస్‌ స్టేషన్‌లో అప్పటి ఎస్‌ఐ బాలకృష్ణ కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు గ్రామ సమీపంలో బొప్పాయి తోటలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. అదే గ్రామానికి చెందిన కాకులారం నందకుమార్‌రెడ్డి అలియాస్‌ ఉదయ్‌(20) బాలుడిని తోటలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడి.. అనంతరం విషయం ఎక్కడ బయటపడుతుందోనని టవల్‌తో గొంతు నులిమి హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. నేరం రుజువు కావడంతో నిందితుడికి జీవితఖైదుతోపాటు వివిధ సెక్షన్ల కింద రూ.13 వేలు జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన పోలీస్‌ అధికారులను, సిబ్బంది జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement