రిజర్వేషన్ల ప్రక్రియ త్వరగా ముగించాలి | - | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్ల ప్రక్రియ త్వరగా ముగించాలి

Oct 14 2026 1:41 AM | Updated on Oct 14 2026 1:41 AM

సాక్షి, మదనపల్లె : జిల్లాలో మండల ప్రజా పరిషత్‌, జిల్లా ప్రజా పరిషత్‌, సర్పంచు,వార్డు సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియను బుధవారం సాయంత్రంలోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌, పీఆర్‌శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్‌ దండే, కమిష నర్‌, మున్సిపల్‌శాఖ ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. స్థానిక సంస్థల పదవుల రిజర్వేషన్లపై అనుసరించాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ఆధారంగా, బీసీ వర్గాలకు తాజా ఓటర్ల జాబితా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించాలని మార్గదర్శకాల్లో పేర్కొనడం జరిగిందని వివరించారు. గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీల రిజర్వేషన్ల ప్రక్రియలోనూ వర్తించే నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్‌ ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్ల ప్రక్రియను మంగళవారం రాత్రిలోగా, సర్పంచ్‌లు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియను బుధవారం సాయంత్రంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. జేసీ శివ నారాయణ శర్మ, సబ్‌ కలెక్టర్‌ చల్లా కళ్యాణి, డీపీఓ రాధమ్మ,డిప్యూటీ సీఈవో ప్రభాకర్‌, కమిషనర్‌ ప్రమీల పాల్గొన్నారు.

కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement