కడపకార్పొరేషన్ : మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల సందర్భంగా టీడీపీ మూకల దాడిలో గాయపడిన వైఎస్సార్సీపీ నాయకులను కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్రెడ్డి పరామర్శించారు. శనివారం సాయంత్రం పల్స్ హాస్పిటల్కు వెళ్లి పులివెందుల మాజీ వైస్ ఛైర్మెన్ హఫీజుల్లాను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అనంతరం మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాష, సీఈసీ సభ్యులు కె. సురేష్ బాబుతో కలిసి రిమ్స్ హాస్పిటల్కు వెళ్లి దాడిలో తీవ్రంగా గాయపడిన శ్యాంసన్, పార్టీ నాయకులను పరామర్శించారు. ఽధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిశోర్ బూసిపాటి, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి షేక్ ఉమైర్, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు రమ్మను నా..
టీడీపీ రీజనల్ కో ఆర్డినేటర్ శ్రీనివాసులురెడ్డి
కడప రూరల్ : స్థానిక గాంధీనగర్ హైస్కూల్ నామినేషన్ కేంద్రం వద్ద పరిస్థితులు రణరంగాన్ని తలపించాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఎవరు కనిపించినా టీడీపీ కార్యకర్తలు దాడి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. నామినేషన్ వేయడానికి వచ్చిన పలువురు వైసీపీ అభ్యర్ధులను కేంద్రంలోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. టీడీపీ శ్రేణులు, నామినేషన్ కేంద్రానికి వస్తున్న వైఎస్సార్సీపీ నాయకులపై రాళ్ల దాడి చేశారు. కర్రలతో కొట్టారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఇక్కడికి వచ్చిన ఆ పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ ఆర్ శ్రీనివాసులురెడ్డి రెచ్చగొట్టేలా మాట్లాడారు. ‘ఇప్పుడు రమ్మను కొడుకల్ని ఎవర్నో, నామినేషన్ వేయడానికి ఏ నా కొడుకొస్తాడో చూద్దాం’ అంటూ తమ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి, మీడియా ఎదుటే రెచ్చగొట్టేలా మాట్లాడారు. దీంతో అక్కడ ఉన్న టీడీపీ శ్రేణులు ఓకే.. ఓకే అంటూ రెచ్చిపోయారు. కాసేపటి తరువాత నామినేషన్ కేంద్రానికి వస్తున్న పులువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై మరో మారు పెద్ద..పెద్ద రాళ్లతో దాడులకు పాల్పడ్డారు.


