బోయకొండ గంగమ్మకు పట్టువస్త్రాల సమర్పణ | - | Sakshi
Sakshi News home page

బోయకొండ గంగమ్మకు పట్టువస్త్రాల సమర్పణ

Oct 18 2026 2:12 AM | Updated on Oct 18 2026 2:12 AM

● రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని పెద్దిరెడ్డి దంపతుల పూజలు

● భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేయించిన ఎంపీ, ఎమ్మెల్యేలు

చౌడేపల్లె : రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలందరూ ఆరోగ్యవంతమైన జీవనం గడపాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణమ్మ దంపతులు ప్రార్థించారు. శనివారం దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాజంపేట ఎంపీ పి.వి. మిథున్‌రెడ్డి – లక్ష్మిదివ్య దంపతులు, తంబళ్ళపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ఆయన తనయుడు అభినయ్‌రెడ్డిలతో కలిసి వారు బోయకొండ గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులు, వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలతో కలిసి అమ్మవారికి సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి విచ్చేసిన పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులకు ఈవో, ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. నవరాత్రి వేడుకల్లో భాగంగా ఆలయంలో సరస్వతి దేవి అలంకారంలో కొలువుదీరిన గంగమ్మ తల్లికి పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డి దంపతులు వేదపండితుల సమక్షంలో ప్రత్యేక అభిషేక పూజలు, అర్చనలు చేయించారు. అనంతరం ఆలయంలోని అమ్మవారి ఉత్సవమూర్తికి, ప్రధాన గర్భాలయం కింద ఉన్న మూల స్థానం, రణభేరి గంగమ్మ ఆలయాల్లో కొలువుతీరిన అమ్మవార్లకు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డి దంపతులకు, ద్వారకనాథరెడ్డికి వేద ఆశీర్వచనం చేశారు. అర్చకులు అమ్మవారి పవిత్ర తీర్థప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని వారికి అందజేశారు. వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన వైఎస్సార్‌సీపీ నేతలు, అభిమానులతో బోయకొండ క్షేత్రం కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు రుక్మిణమ్మ, బైరెడ్డిపల్లె క్రిష్ణమూర్తి, మాజీ డీసీసీబీ చైర్మన్‌ రెడ్డెమ్మ, ఆలయ మాజీ చైర్మన్‌ శంకర్‌ నారాయణ, మాజీ వైస్‌ ఎంపీపీ సుధాకర్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు నాగభూషణరెడ్డి, ఉపాధ్యక్షులు వెంకటరమణ, లడ్డూరమణ, మాజీ ఎంపీపీ రెడ్డిప్రకాష్‌, నాయకులు మునికృష్ణమనాయుడు, జి.ఆర్‌.ఎస్‌. రమణ, గంగిరెడ్డి, పద్మనాభరెడ్డి, కళ్యాణ్‌ భరత్‌, రమేష్‌బాబు, రవిచంద్రారెడ్డి, రామకృష్ణ, షంషీర్‌, నరేష్‌, బి. నరసింహారెడ్డి, వెంకటరెడ్డి, సోని, ప్రభాకర్‌ యాదవ్‌, విజయ్‌, డిష్‌ సూరి, శ్రీనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement