దళిత మహిళ నామినేషన్‌ను లాక్కెళ్లిన టీడీపీ నేతలు | - | Sakshi
Sakshi News home page

దళిత మహిళ నామినేషన్‌ను లాక్కెళ్లిన టీడీపీ నేతలు

Oct 19 2026 4:01 AM | Updated on Oct 19 2026 4:01 AM

పుంగనూరు : తెలుగుదేశం పార్టీ అరాచకాలకు అడ్డు అదుపులేకుండా పోయింది. మున్సిపల్‌ నామినేషన్ల స్వీకరణలో మూడవ రోజైన ఆదివారం కూడ అరాచకాలు కొనసాగాయి. వైఎస్సార్‌సీపీ 1వ వార్డుకు దళిత మాజీ కౌన్సిలర్‌ కమలమ్మ నామినేషన్‌ వేసేందుకు కేంద్రం వద్దకు రాగానే తెలుగుదేశం నాయకులు దళిత మహిళ అని కూడా చూడకుండా ఆమైపె దాడి చేసి, నామినేషన్‌ లాకెళ్లడంతో ఆమె ఆగ్రహంతో రగిలిపోయారు. పోలీసులు ఉన్నా ఆమెకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారు. పైగా ఆమెనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేసి, తెలుగుదేశం ఆగడాలకు అండగా నిలిచారు. ఈ అరాచకాలపై పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement