గాలివీడు : అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం చెక్కవాళ్లపల్లెలో గురువారం గ్యాస్ లీకై జరిగిన పేలుడులో తండ్రి, కొడుకులకు తీవ్ర గాయాలయ్యాయి. బీహార్‌కు చెందిన వారు పానీపూరి వ్యాపారం నిర్వహిస్తూ ఇంట్లో పూరీలు తయారు చేస్తుండగా గ్యాస్ లీకై ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో తండ్రి, కొడుకులకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని తెలియడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.


