మృత్యువులోనూ వీడని స్నేహ బంధం | - | Sakshi
Sakshi News home page

మృత్యువులోనూ వీడని స్నేహ బంధం

Sep 25 2026 12:29 AM | Updated on Sep 25 2026 12:29 AM

వేంపల్లె/యాదమరి : అతివేగం..అజాగ్రత్త డ్రైవింగ్‌ ఇద్దరు స్నేహితుల ప్రాణాలను బలితీసుకుంది. రహదారిపై మృత్యువు రూపంలో దూసుకొచ్చిన టాటా ఏస్‌ వాహనం ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొనడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలంలో బుధవారం అర్థరాత్రి సమయంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. స్థానిక ఎస్సై ఈశ్వర్‌ కథనం మేరకు..వైఎస్సార్‌ కడప జిల్లా వేంపల్లె మండలం నాగూరు గ్రామానికి చెందిన నాగేళ్ల రామచంద్రారెడ్డి కుమారుడు రాంప్రసాద్‌రెడ్డి(21) ముత్తిరేవుల సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం రాత్రి రాంప్రసాద్‌ తన స్నేహితుడైన చిత్తూరు పెద్ద హరిజనవాడకు చెందిన సురేష్‌ కుమారుడు ధనుష్‌(21)తో కలసి ద్విచక్రవాహనంలో ఓ ప్రైవేట్‌ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ నుంచి పని ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో మండల పరిధి వరిగపల్లి జంక్షన్‌ వద్ద ఉన్న సర్వీసు రోడ్డులో ఎదురుగా వస్తున్న వీరి వాహనాన్ని టాటా ఏస్‌ డీకొంది. ఈ ప్రమాదంలో రాంప్రసాద్‌రెడ్డి తీవ్ర గాయాలతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటన స్థలికి చేరుకున్నారు. తీవ్ర రక్తగాయాలతో మృత్యువుతో పోరాడుతున్న ధనుష్‌ను 108 అంబులెన్సు ద్వారా చితూరు ప్రభుత్వాసుపత్రికి తరలిలించారు. అయితే అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇంజినీరింగ్‌ చదివి గొప్ప వాడై తమకు అండగా నిలుస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న రాంప్రసాద్‌ ఆసుపత్రిలో విగతిజీవిగా ఉండటాన్ని చూసి కుటుంబసభ్యులు రోదనలు మిన్నంటాయి. ఎస్సై ఈశ్వర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు పరిమిత వేగంతో ప్రయాణించాలని, రహదారి భద్రతా నియమాలు విధిగా పాటించి ప్రమాదాల బారీన పడకుండా విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని ఎస్సై సూచించారు.

రాంప్రసాద్‌రెడ్డి(ఫైల్‌)

ధనుష్‌(ఫైల్‌)

ద్విచక్ర వాహనాన్ని డీకొని

ఇద్దరు యువకులు దుర్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement