కల్తీ మద్యం కేసులో ముగిసిన కస్టడీ | - | Sakshi
Sakshi News home page

కల్తీ మద్యం కేసులో ముగిసిన కస్టడీ

Sep 25 2026 12:29 AM | Updated on Sep 25 2026 12:29 AM

మదనపల్లె టౌన్‌ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన అన్నమయ్య జిల్లా ములకలచెరువు కల్తీ మద్యం కేసులో ఏ–17 నిందితుడు తంబళ్లపల్లె టీడిపీ నియోజకవర్గ మాజి ఇన్‌చార్జి దాసరిపల్లె జయచంద్రా రెడ్డి, ఆయన బావమరిధి గిరిధర్‌ రెడ్డి లను గురువారం కడప సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఈ కేసులోఏ–17 నిందితుడు దాసరిపల్లి చంద్రారెడ్డి, ఏ–18 నిందితుడు ఆయన బావమరిది గిరిధర్‌రెడ్డిల మూడు రోజుల ఎకై ్సజ్‌ పోలీసుల కస్టడీ గురువారంతో ముగిసింది. కస్టడీలో నిందితుల నుంచి కేసుకు సంబంధించిన కీలక సమాచారాన్ని, వాంగ్మూలాలను సేకరించినట్లు అన్నమయ్య జిల్లా ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ జోగేంద్ర గురువారం మీడియాకు తెలిపారు. సేకరించిన వివరాలతో నివేదికలను ఉన్నతాధికారులకు పంపినట్లు చెప్పారు. కస్టడీ ముగిసిన అనంతరం ఇద్దరు నిందితులను మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి, వైద్యులతో ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించామన్నారు. అనంతరం స్థానిక కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఇద్దరినీ కడప సెంట్రల్‌ జైలుకు తరలించినట్లు ఎకై ్సజ్‌ అధికారులు తెలిపారు.

టీడిపీ నేత దాసరిపల్లె జయచంద్రా రెడ్డి, గిరిధర్‌ రెడ్డి కడప సెంట్రల్‌ జైలుకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement