పక్కాగా ఓటరు జాబితాల రూపకల్పన | - | Sakshi
Sakshi News home page

పక్కాగా ఓటరు జాబితాల రూపకల్పన

Sep 25 2026 12:29 AM | Updated on Sep 25 2026 12:29 AM

● పెండింగ్‌ దరఖాస్తులు మరోసారి పరిశీలన

● జిల్లా ఎలక్టోరల్‌ రోల్‌ అబ్జర్వర్‌

కెవిఎన్‌.చక్రధర్‌ బాబు

సాక్షి, మదనపల్లె: స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌)లో భాగంగా చేపట్టిన ఓటర్ల జాబితా పునఃసమీక్ష ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనల మేరకు పూర్తి చేసి లోపాలు లేని తుది ఓటరు జాబితాను రూపొందించాలని జిల్లా ఎలక్ట్రోరల్‌ రోల్‌ అబ్జర్వర్‌ కెవిఎన్‌.చక్రధర్‌ బాబు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు, బీఎల్‌ఓలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎలక్టోరల్‌ రోల్‌ ప్రక్రియపై వేర్వేరుగా సమీక్షించారు. కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. బీఎల్‌ఓలు ఇంటింటి సందర్శన, పోలింగ్‌ కేంద్రాల రేషనలైజేషన్‌, రీ–అరేంజ్‌మెంట్‌, డ్రాఫ్ట్‌ పబ్లికేషన్‌, క్లెయిమ్స్‌ అండ్‌ అబ్జెక్షన్స్‌, నోటీసుల జారీ, ఓటర్ల చేర్పులు, తొలగింపులు, సవరణలకు సంబంధించిన ప్రక్రియలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. జూలై 31 నాటికి 1,424 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 10,83,736 మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో 5,33,064 మంది పురుషులు, 5,50,578 మంది మహిళలు, 94 మంది థర్డ్‌ జెండర్‌ ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలో ఎలక్టోరల్‌ రోల్‌ ప్రక్రియ పురోగతిని పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ద్వారా అబ్జర్వ ర్‌కు వివరించారు.

పెండింగ్‌ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి

అబ్జర్వర్‌ చక్రధర్‌ బాబు మాట్లాడుతూ మిగిలిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను మరోసారి పరిశీలించాలని సూచించారు. ఒకే డోర్‌ నంబర్‌కు 10 కంటే ఎక్కువ ఓట్లు నమోదై ఉంటే వాటిని తప్పనిసరిగా వెరిఫై చేయాలని సూచించారు. బూత్‌ లెవల్‌ అధికారులు ఫారం–6, 7, 8, 8ఏలకు సంబంధించిన దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి, రిజిస్టర్లను నిర్వహించాలని ఆదేశించారు. రాజకీయ పార్టీలు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశాల్లో జేసీ శివ్‌ నారాయణ్‌ శర్మ, సబ్‌ కలెక్టర్‌ చల్లా కళ్యాణి, డీఆర్‌ఓ వెంకటేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement