వచ్చారు.. వెళ్లారు! | - | Sakshi
Sakshi News home page

వచ్చారు.. వెళ్లారు!

Sep 25 2026 12:29 AM | Updated on Sep 25 2026 12:29 AM

– డీఈఈ బాధ్యతలపై ఉత్కంఠ

సాక్షి, మదనపల్లె: ఏపీ గ్రీన్‌ అండ్‌ బ్యూటీఫికేషన్‌ కార్పొరేషన్‌లో డీఈఈగా పని చేస్తున్న కే.బాలసుబ్రమణ్యంను మదనపల్లె మున్సిపాలిటీకి డీఈఈగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ఈ మేరకు బాధ్యతలు చేపట్టేందుకు బుధవారం ఆయన మదనపల్లెకు వచ్చారు. ఏం జరిగిందో ఏమో వెంటనే వెనుతిరిగి విజయవాడ వెళ్లిపోయారు. కాగా మదనపల్లె మున్సిపాలిటీలో ఇప్పటికే అన్ని విభాగాల్లో ఉద్యోగులు, అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పట్టణ ప్రణాళిక విభాగం పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ స్థాయి అధికారి ఉండాల్సిన మున్సిపాలిటీలో వార్డు సచివాలయ సిబ్బంది విధులు నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో మున్సి పాలిటీకి బదిలీ చేసిన డీఈఈ విధుల్లో చేరకపోతే సెలక్షన్‌ గ్రేడ్‌ స్థాయి మున్సిపాలిటీకి మరిన్ని రోజులు పాలనాపరమైన ఇబ్బందులు తప్పవు.

రూ.9 లక్షలు పలికిన

వినాయకుడి లడ్డూ

రాయచోటి టౌన్‌ : అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని మదనపల్లె రోడ్డులో ఎమ్మెస్సార్‌ కాలనీలో వినాయకుడి లడ్డూ ప్రసాదం వేలం నిర్వహించారు. అదే ప్రాంతానికి చెందిన మారగాని సాయి యాదవ్‌ రూ.9లక్షలకు లడ్డూను దక్కించుకున్నాడు. అలాగే మడితాటి శ్రీనివాసుల రెడ్డి కలశం చెంబు రూ.2క్షలకు దక్కించుకున్నాడు.వీటిని దక్కించుకున్న వారి నిర్వాహకులు సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement