మద్యం షాపులకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

మద్యం షాపులకు దరఖాస్తుల ఆహ్వానం

Sep 25 2026 12:29 AM | Updated on Sep 25 2026 12:29 AM

మదనపల్లె టౌన్‌: అన్నమయ్య జిల్లా పరిధిలో 17 మద్యం షాపులను లాటరీ పద్ధతిలో కేటాయించనున్నట్లు జిల్లా ప్రొహిబిషన్‌అండ్‌ ఎకై ్సజ్‌ అధికారి బి. మధుసూదన్‌ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు జిల్లా గెజిట్‌ నం.62/2026 విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 24 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై, అక్టోబర్‌ 1 రాత్రి 12 గంటల వరకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానాల్లో దరఖాస్తులు సమర్పించవచ్చన్నా రు. అక్టోబర్‌ 3న దరఖాస్తుల పరిశీలన, అక్టోబర్‌ 5 ఉదయం 8 గంటలకు మదనపల్లె కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో కలెక్టర్‌ ఆధ్వర్యంలో లాటరీ నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే రోజు ఎంపికై న విజేతల వివరాలను ప్రకటిస్తామన్నారు.

జిల్లాలో ఖాళీగా ఉన్న షాపులు

రాయచోటి మున్సిపాలిటీలో 2, రాయచోటి రూరల్‌లో 1, చిన్నమండెంలో 2, ఎల్‌.ఆర్‌.పల్లిలో 1, గాలివీడులో 1, ములకలచెరువులో 1, పెద్దమండ్యంలో 1, పెద్దతిప్పసముద్రంలో 1, తంబళ్లపల్లెలో 1, గుర్రంకొండలో 2, పుంగనూరు మున్సిపాలిటీలో 3, సోమలలో 1 ఉన్నాయని వారు తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాల కోసం 79812 16391 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

జిల్లా ఎకై ్సజ్‌ అధికారి

మధుసూదన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement